☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..

Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, వారణాసి నగరాల్లో పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటనలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. ఈ ఘటన తరువాత ఈ పర్యటన రద్దు కావడానికి కమిషన్ సభ్యుల మధ్య విభేదాలే కారణమనిపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీఐ వివరణ ఇచ్చింది. ఈ వార్తలకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. లాజిస్టికల్ ఇబ్బందులు, స్థానిక పరిస్థితులు, అలాగే సిఇసికి ఉన్న ఇతర అధికారిక కార్యక్రమాల వల్లే ఈ పర్యటనలను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 21నే నిర్ణయించి, సంబంధిత జిల్లాల అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొన
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..

Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, వారణాసి నగరాల్లో పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటనలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. ఈ ఘటన తరువాత ఈ పర్యటన రద్దు కావడానికి కమిషన్ సభ్యుల మధ్య విభేదాలే కారణమనిపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీఐ వివరణ ఇచ్చింది. ఈ వార్తలకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. లాజిస్టికల్ ఇబ్బందులు, స్థానిక పరిస్థితులు, అలాగే సిఇసికి ఉన్న ఇతర అధికారిక కార్యక్రమాల వల్లే ఈ పర్యటనలను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 21నే నిర్ణయించి, సంబంధిత జిల్లాల అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనల వాయిదా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం.. ఇటీవల ఎన్నికల సంఘం లోపల విభేదాలు బయటపడ్డాయంటూ వస్తున్న వార్తలే. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దర్యాప్తు కథనం ప్రకారం, అక్టోబర్ 2025 నుంచి ఆగస్టు 2026 మధ్య కాలంలో ఓటర్ల జాబితాలకు సంబంధించిన పలు నిర్ణయాలపై మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఏకంగా 14 సార్లు తమ వ్యతిరేకతను (అభ్యంతరాలను) రికార్డు చేశారు. ప్రత్యేక తీవ్ర సమగ్ర సవరణ (SIR), ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, అప్పీళ్లు, ఈసీ ఓటర్ డేటా సాఫ్ట్‌వేర్ యాక్సెస్ వంటి కీలక అంశాలపై వీరు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఈ సమయంలో ముగ్గురు సభ్యుల కమిషన్ కలిసి అనేక మీడియా సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ, ఈ ఇద్దరు కమిషనర్లు ఎక్కడా తమ విభేదాలను బయటకు రానివ్వకపోవడం గమనార్హం.

మరోవైపు, 2024 తర్వాత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సంక్షిప్త సవరణ’ (SSR) చేపట్టలేదని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఈ ప్రక్రియ చాలా కీలకం. ఈ ఆలస్యంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే, కేవలం ఉత్తరప్రదేశ్ పర్యటనలే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ పర్యటనలు కూడా వాయిదా పడ్డాయని ఎన్నికల సంఘం వర్గాలు వివరణ ఇచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక సీజన్, పరీక్షల వల్ల కార్యక్రమం వాయిదా వేయగా.. ఉత్తరాఖండ్‌లో ‘SIR’ ప్రక్రియ పూర్తయ్యాక యువతతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మానససరోవర్ ప్రమాదం కారణంగా లడఖ్ పర్యటన వాయిదా పడింది. ఇలాంటి యూత్ ఇంటరాక్షన్ కార్యక్రమాలకు దాదాపు వెయ్యి మంది వరకు వస్తుంటారని, అందుకే వాతావరణం, స్థానిక పరిస్థితులు, వనరులను బట్టి సమయాన్ని ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పైగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లడం కూడా కొన్ని కార్యక్రమాలు వెనక్కి వెళ్లడానికి కారణమైంది. ఇక ఒక్కో పర్యటనకు రూ. 1.5 కోట్ల వరకు ఖర్చవుతుందనే వార్తలపై స్పందిస్తూ, కార్యక్రమం నిజంగా జరిగినప్పుడు మాత్రమే ఆ ఖర్చు అవుతుంది తప్ప, వాయిదా పడితే ఖర్చు కాదని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com