☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Central Government Employees : బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌!

Central Government Employees : బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Central Government Employees : బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌!

Central Government Employees : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడురోజులు (సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు) సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌ను ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది.

Also Read : Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!

బ్యాంకు సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్లు జమ కావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెప్టెంబర్ నెల వేతనాలు, పెన్షన్లను ఐదు రోజుల ముందుగానే అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా నెలాఖరులో జరిగే చెల్లింపులు సమ్మె ప్రభావంతో ఆలస్యం కాకుండా ముందస్తుగా చెల్లింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మరోవైపు మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 27న ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆ రోజు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. సమ్మెకు ముందు రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా నెలాఖరులో నగదు లావాదేవీలు, జీతాలు, పెన్షన్లు తదితర ముఖ్యమైన చెల్లింపుల్లో అంతరాయం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danam Nagender : దానం నాగేందర్‌ను టెన్షన్ పెడుతున్న గత ఉపఎన్నిక..! ఈసారి మంత్రిగా బరిలోకి?Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com