☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

EPF Pension Hike: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పెరగనున్న పెన్షన్.. 51 లక్షల మందికి జాక్‌పాట్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPF Pension Hike) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల వేతన పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయించింది.
EPF Pension Hike: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పెరగనున్న పెన్షన్.. 51 లక్షల మందికి జాక్‌పాట్

EPF Pension Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దిశగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ నూతన నిబంధనతో, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న రూ.25,000 లోపు వేతనం పొందే ఉద్యోగులందరూ ఇకపై తప్పనిసరిగా పిఎఫ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది కొత్త ఉద్యోగులకు పీఎఫ్ కవరేజ్ లభించడంతో పాటు పెన్షన్, ఉచిత జీవిత బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి.

BJP State Incharges: తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. 28 రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. ప్రకటించిన బీజేపీ అధిష్టానం

పింఛన్ గణన విధానం.. పెరగనున్న నెలవారీ బెనిఫిట్:

వేతన పరిమితి పెరగడంతో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లభించే నెలవారీ పింఛన్(EPF Pension Hike) కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగి పదవీ విరమణకు ముందు పొందిన చివరి 60 నెలల సగటు జీతం, మొత్తం సర్వీస్ ఆధారంగా పింఛన్‌ను లెక్కిస్తారు. కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన చందాదారులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలానెలా పింఛన్ చెల్లిస్తారు. పెరిగిన జీతం స్లాబుల వల్ల నెలవారీ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ పెరిగి, రిటైర్మెంట్ సమయంలో చేతికి అందే పింఛన్ అమౌంట్ పెరుగుతుంది.

సర్వీస్, వేతనాన్ని బట్టి పెన్షన్ లెక్కలు:

ఉద్యోగుల సర్వీస్ కాలం, అర్హత కలిగిన వేతనాన్ని బట్టి పెన్షన్ మొత్తంలో స్పష్టమైన మార్పులు ఉంటాయి. ఉదాహరణకు 10 ఏళ్ల సర్వీస్ ఉండి రూ.17,000 అర్హత జీతం ఉన్నవారికి నెలకు రూ.2,429, అలాగే రూ.21,000 జీతం ఉంటే రూ.3,000 వరకు పెన్షన్ వస్తుంది. అదే 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి వేతాన్ని బట్టి రూ.5,343 నుండి రూ.6,600 వరకు ప్రాప్తిస్తుంది. ఇక 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ కలిగిన ఉద్యోగులు రూ.21,000 అర్హత జీతంతో గరిష్టంగా రూ.9,600 వరకు నెలవారీ ఈపీఎస్ పెన్షన్ పొందే అవకాశం ఏర్పడింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kayadu Lohar 80s : గులాబి పువ్వుతో ది ప్యారడైజ్ బ్యూటీ.. కయ్యదు లోహర్‌ క్యూట్ ఫోటోలు..Bigg Boss Today Promo : అటు అమ‌న్‌, ఇటు వ‌ర్షిణి.. ఎవ్వ‌రు త‌గ్గేదేలే.. బిగ్ బాస్ ప్రోమో వైరల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com