☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..

CM Chandrababu: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రజారక్షణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పది మంది పోలీసులు వీరమరణం పొందారని చంద్రబాబు గుర్తుచేశారు. […]
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..

CM Chandrababu: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రజారక్షణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పది మంది పోలీసులు వీరమరణం పొందారని చంద్రబాబు గుర్తుచేశారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మాతృభూమి రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యతని స్పష్టం చేశారు.

ఖాకీ అంటే బాధ్యత.. పోలీసంటే భరోసా
ఖాకీ అంటే బాధ్యతకు, పోలీసంటే భరోసాకు ప్రతీక అని చంద్రబాబు అన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులు ధైర్యం, స్థైర్యాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినా, నేరం చోటుచేసుకున్నా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చెప్పారు. నిరంతరం విధుల్లో ఉంటూ ప్రజల కోసం సేవలందించే విభాగం పోలీసు శాఖ అని కొనియాడారు. దుర్గగుడి శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. వీఐపీల భద్రత నుంచి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసులు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు సైతం దూరంగా ఉంటారని గుర్తుచేశారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, అది మన బాధ్యతని పేర్కొన్నారు.

ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబు అన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం, నేరాలను ఛేదించడంలో రాష్ట్ర పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు ఉందని తెలిపారు. గతంలో ఫ్యాక్షన్‌ను నియంత్రించడం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, మత కలహాలను అరికట్టడంలో పలువురు అధికారులు, సిబ్బంది అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అలజడి, అశాంతి, అభద్రత ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రారని అన్నారు. అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

దేశ భద్రతలో ఏపీ పోలీసుల కీలక పాత్ర
ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ రక్షణకు భంగం కలిగించే కుట్రలను ఛేదించిందని చంద్రబాబు తెలిపారు. ఈ చర్యలతో ఏపీ పోలీసుల ప్రతిష్ట మరింత పెరిగిందని పేర్కొంటూ, దేశ భద్రతలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. పోలీసు విధుల్లో ధైర్యం ఎంత అవసరమో, మానవత్వం కూడా అంతే అవసరమని సీఎం సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని చెప్పారు. కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో పోలీసులను ఆశ్రయిస్తారని, వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. పోలీసు యూనిఫాం బాధితులకు అభయమివ్వాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలని అన్నారు. పోలీసులు తక్షణమే స్పందించడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని, వారి పనితీరు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేలా ఉండాలని ఆకాంక్షించారు. నేరస్థులకు ఖాకీని చూస్తే భయం కలగాలని, బాధితులకు పోలీసులపై నమ్మకం ఏర్పడాలని స్పష్టం చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కాలానుగుణంగా నేరాలు చేసే విధానాలు మారుతున్నాయని, వాటికి అనుగుణంగా దర్యాప్తు పద్ధతులు కూడా మారాలని చంద్రబాబు సూచించారు. ఒక్క ఫోన్ కాల్, ఒక లింక్ లేదా ఒక సందేశం ద్వారా సైబర్ నేరగాళ్లు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం సైబర్ మోసాల బారిన పడుతున్నారని పేర్కొంటూ, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ ముసుగులో జరిగే నేరాలను సహించవద్దని పోలీసులకు స్పష్టం చేశారు. రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీలపై కఠినంగా వ్యవహరించాలని, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిని కూడా వదలకూడదని సూచించారు.

ఏఐ, డ్రోన్లతో దర్యాప్తు సామర్థ్యం పెంచాలి
నేరాన్ని ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, నేరం జరగకుండా నివారించడం ఉత్తమ పోలీసింగ్‌కు గుర్తు అని చంద్రబాబు అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాలను గుర్తించడంలో ఉపయోగపడతాయని, డేటా విశ్లేషణ ద్వారా నేరాల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవచ్చని చెప్పారు. డ్రోన్లతో పోలీసుల నిఘా పరిధిని విస్తరించవచ్చని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా విశ్లేషణ, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వివరించారు. దేశవ్యాప్తంగా ఏపీ పోలీసులకు సాంకేతికతలో అగ్రస్థానం ఉందనే గుర్తింపు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు భద్రత కల్పిస్తూ, నేరాలను సమర్థంగా అరికడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు శాఖ మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసాTiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com