☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపుతప్పి, రోడ్డు డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, ప్రమాదంలో గాయపడిన వారిని గుర్తించారు. బాధితులు షాబాద్ […]
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపుతప్పి, రోడ్డు డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, ప్రమాదంలో గాయపడిన వారిని గుర్తించారు.

బాధితులు షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా గాయపడి మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను ముందుగా సమీపంలోని మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న భాస్కర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వారిని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే బ్రిడ్జి , పామెన గేటు సమీపంలో ఇలాగే వేగంగా వచ్చిన వాహనాలు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న చేవెళ్ల పోలీసులు కారు బోల్తా పడిన తీరుపై, ప్రయాణ వివరాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com