☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jinping | అమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..! ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆహ్వానం పలికిన ట్రంప్ దంప‌తులు

Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Jinping) అమెరికాలో(America) అరుదైన గౌర‌వం(Rare honor) ల‌భించింది.
Jinping | అమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..! ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆహ్వానం పలికిన ట్రంప్ దంప‌తులు

Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Jinping) అమెరికాలో(America) అరుదైన గౌర‌వం(Rare honor) ల‌భించింది. వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సమావేశానికి యూఎస్ చేరుకున్న‌జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) త‌న స‌తీమ‌ణి మెలానియాతో క‌లిసి స్వయంగా విమానాశ్రయానికి చేరుకొని సైనిక విమానాల విన్యాసంతో, 100 అడుగుల (30 మీటర్ల) రెడ్ కార్పెట్‌తో ఘ‌న స్వాగతం పలికారు. అమెరికా వైమానిక దళ బ్యాండ్ రన్‌వేపై కవాతు చేస్తుండగా, అమెరికా- చైనా జెండాలు రెపరెపలాడుతుండగా ట్రంప్ విమానాశ్రయంలోనే చైనా ప్రధానిని కలిశారు.

2015 తర్వాత వాషింగ్టన్‌లో షీ జిన్‌పింగ్ ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ కీలకమైన పర్యటనలో రహస్య సమావేశాలు, ఒక అధికారిక విందుతో పాటు, ఏఐ (AI) నుండి ఇరాన్ యుద్ధం, తైవాన్ స‌మ‌స్య‌, ఇంకా పొడిగించిన వాణిజ్య సంధి వరకు చర్చించడానికి చాలా అంశాలు ఉంటాయని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే మే నెల‌లో ట్రంప్ చైనాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. నాడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంట్‌కు ఇలాంటి మ‌ర్యాద‌లు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ram Charan | రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. మరోసారి తెరపైకి క్రేజీ కాంబినేషన్ టాక్!The Paradise | ‘ది ప్యారడైజ్’కు తమిళనాడు, కర్ణాటకలో అదిరిపోయే క్రేజ్.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com