☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Chiranjeevi | ‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై చిరంజీవి ఆగ్రహం.. ఇది సరదాగా తీసుకునే విషయం కాదు ..

Chiranjeevi | ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకు ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పాటను కొందరు వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలుగా మార్చి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Chiranjeevi | ‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై చిరంజీవి ఆగ్రహం.. ఇది సరదాగా తీసుకునే విషయం కాదు ..

Chiranjeevi | ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకు ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పాటను కొందరు వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలుగా మార్చి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఏఐ డీప్‌ఫేక్‌ల ద్వారా రూపొందిస్తున్న ఇలాంటి వీడియోలపై ఇప్పటికే ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాంకేతికతను ఉపయోగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఏఐ సాంకేతికతను ఉపయోగించి అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడమే కాకుండా వాటిని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఈ సమస్య కేవలం ఒక హీరోయిన్‌కు లేదా ఒక సినిమా బృందానికి మాత్రమే పరిమితమైనది కాదని.. రేపు సమాజంలోని ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వికృత వీడియోలను సరదాగా చూడటం, వాటిని కాలక్షేపంగా తీసుకోవడం లేదా మరింతగా ప్రచారం చేయడం సరికాదని చిరంజీవి అన్నారు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతున్నప్పుడు ప్రేక్షకులుగా మౌనంగా ఉండటం కూడా సమస్యను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై పోరాడేందుకు సినీ పరిశ్రమ తరఫున వ్యవస్థాగతమైన చర్యలు అవసరమని చిరంజీవి సూచించారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, ఇతర సినీ సంఘాలతో చర్చించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు త్వరగా న్యాయం అందించడం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను సామాజిక మాధ్యమాల నుంచి వీలైనంత త్వరగా తొలగించడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు కనిపించినప్పుడు వాటిని ఇతరులకు పంపించవద్దని చిరంజీవి సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. తప్పును ఎత్తిచూపే ఉద్దేశంతోనైనా అలాంటి వీడియోలను మళ్లీ పోస్టు చేయడం వల్ల అవి మరింత మందికి చేరే అవకాశం ఉందని హెచ్చరించారు.

అభ్యంతరకరమైన వీడియోలు కనిపించిన వెంటనే సంబంధిత డిజిటల్ వేదికలకు ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏఐ సాంకేతికతను సృజనాత్మకత కోసం ఉపయోగించాలి తప్ప.. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేందుకు ఉపయోగించకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ విషయంలో సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, అభిమానులు కలిసి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Free Bus | మహిళల తర్వాత వృద్ధులకూ ఫ్రీ బస్సు.. తెలంగాణలో త్వరలో కొత్త పథకం?Drishyam 3 | బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ‘దృశ్యం 3’ సంచలనం.. తొలిరోజే రికార్డు వసూళ్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com