☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!

దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ అందరిలా హీరో కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఎందుకు మారాడన్న దానిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హీరో సందీప్ కిషన్ నటిస్తూ, జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, జాసన్ దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పంచుకున్నారు. జాసన్‌ను కలవగానే.. “నువ్వు 93-95 టైమ్‌లో మీ […]
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!

దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ అందరిలా హీరో కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఎందుకు మారాడన్న దానిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హీరో సందీప్ కిషన్ నటిస్తూ, జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, జాసన్ దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పంచుకున్నారు.

జాసన్‌ను కలవగానే.. “నువ్వు 93-95 టైమ్‌లో మీ నాన్న ఎలా ఉండేవాడో అచ్చు గుద్దినట్లు అలాగే ఉన్నావు. మరి యాక్టర్ అవ్వకుండా డైరెక్షన్ ఎందుకు ఎంచుకున్నావు?” అని చిరు నేరుగా అడిగేశారట. దానికి జాసన్ స్పందిస్తూ.. తనకు ముందు నుంచి రైటింగ్, డైరెక్షన్ మీదే ఆసక్తి అని బదులిచ్చాడు. దీన్ని బట్టి చూస్తే జాసన్‌కు వాళ్ల నాన్న విజయ్ యాక్టింగ్ క్వాలిటీస్ కాకుండా, వాళ్ల తాతయ్య ఎస్.ఏ. చంద్రశేఖర్, నాయనమ్మ శోభల లక్షణాలు జీన్స్ ద్వారా వచ్చాయని తనకు అనిపించిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో తన కెరీర్లో సూపర్ హిట్ చిత్రాలైన ‘చట్టానికి కళ్ళు లేవు’, ‘దేవాంతకుడు’ సినిమాలను ఎస్.ఏ. చంద్రశేఖర్ డైరెక్ట్ చేస్తే, వాళ్ల ఆవిడ శోభ ఆ కథలు రాశారని.. కచ్చితంగా వాళ్లిద్దరి లక్షణాలనే జాసన్ పుణికిపుచ్చుకున్నాడని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆ కుటుంబంతో తనకున్న మూడు తరాల అనుబంధాన్ని చిరు గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో తాను నటించానని, ఆ తర్వాత విజయ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన ఓ సినిమా ప్రారంభోత్సవానికి తాను, రజినీకాంత్ గారు కలిసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం కుర్రాడు జాసన్ అడగగానే ఆ ఫ్యామిలీపై ఉన్న గౌరవంతో, హీరో సందీప్ కిషన్‌పై ఉన్న ఇష్టంతో ఈ వేడుకకు వెంటనే ఓకే చెప్పినట్లు స్పష్టం చేశారు.

తాత ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకుడిగా, తండ్రి విజయ్ స్టార్ హీరోగా తమ రంగాల్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లారో, ఇప్పుడు జాసన్ కూడా తన ప్యాషన్‌తో దర్శకుడిగా అదే స్థాయికి చేరుకుంటాడని చిరంజీవి ఆశీర్వదించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సిగ్మా’ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?వైన్స్‌ బంద్‌.. ఫంక్షన్‌ హాల్‌లో ఫుల్‌ ఎంజాయ్‌! సిద్దిపేటలో 100 మంది ఉద్యోగుల మందు పార్టీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com