☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jantar Mantar 2.0 : జంతర్‌మంతర్ 2.0 లోడింగ్.. సీఈసీ రాజీనామా చేయాలంటూ సీజేపీ డెడ్‌లైన్.. లేదంటే.. డిమాండ్లు ఇవే..

Jantar Mantar 2.0 : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) 48గంటల గడువు విధించింది.
Jantar Mantar 2.0 : జంతర్‌మంతర్ 2.0 లోడింగ్.. సీఈసీ రాజీనామా చేయాలంటూ సీజేపీ డెడ్‌లైన్.. లేదంటే.. డిమాండ్లు ఇవే..

Jantar Mantar 2.0 : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) 48గంటల గడువు విధించింది. ఈ గడువులోగా ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఢిల్లీలో మరోసారి ‘జంతర్ మంతర్ 2.0’ తరహా నిరసన చేపడతామని ఆయన హెచ్చరించారు.

Also Read : Rahul Gandhi : సర్ వివాదం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌‌ టార్గెట్‌గా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్..! ప్రశ్నల వర్షం..

సర్ పై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలతో దుమారం చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీలో సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే రెండు రోజుల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని, అనంతరం ఢిల్లీలో జంతర్ మంతర్ 2.0 తప్పకుండా చేపట్టి తీరుతామని అన్నారు.

సీఈసీ రాజీనామాతోపాటు సీజేపీ ప్రతినిధులు పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. సీఈసీపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని, ఎన్నికల జాబితాలపై కొనసాగుతున్నసర్ ప్రక్రియను నిలిపివేయాలని, అలాగే సర్‌కు ముందున్న ఓటర్ల జాబితాలను పునరుద్ధరించి, మొత్తం ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేసి, ప్రజల విశ్వాసాన్నిపెంచే కొత్త చట్టాన్ని తీసుకురావాలని సీజేపీ ప్రతినిధులు కోరారు. త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భావిస్తే విపక్షాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దని సీజేపీ ప్రతినిధులు సూచించారు. ప్రజాస్వామ్యానికి సీఈసీ ఓ ముప్పులా తయారయ్యారని అన్నారు. ఓటుహక్కు రద్దు చేసేందుకు ఆయన ఎవరు? అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రశ్నించారు.

ఇదిలాఉంటే.. రాహుల్ గాంధీ సైతం సీఈసీ జ్ఞానేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలి. ఓటు చోరీ గురించి ఈసీలకు ముందే తెలుసు.. అన్ని ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.

మరోవైపు.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← iPhone Air Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?Google Pixel 10 Deal : ఇది కదా డిస్కౌంట్.. ఈ పిక్సెల్ 10 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com