☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

సీజేపీ ఉద్యమ దెబ్బకు దారిలోకి వచ్చిన ఈసీ..?

రాజకీయాల్లో ప్రజాపోరాటాలకు, బలమైన ఉద్యమాలకు వ్యవస్థలు సైతం లొంగక తప్పదనే అంశానికి తాజా పరిణామాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీజేపీ సరికొత్త ఉద్యమానికి తెరలేపి, ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మరియు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పట్టుబట్టిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్యంగా దారిలోకి వచ్చింది. సీజేపీ డిమాండ్లు, దేశవ్యాప్త ఆందోళనల దెబ్బకు స్పందించిన ఎన్నికల సంఘం.. ‘సర్ ప్రక్రియ’ ముగిసిన రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రయోజనాల […] The post సీజేపీ ఉద్యమ దెబ్బకు దారిలోకి వచ్చిన ఈసీ..? appeared first on Telugu Rajyam.
సీజేపీ ఉద్యమ దెబ్బకు దారిలోకి వచ్చిన ఈసీ..?

రాజకీయాల్లో ప్రజాపోరాటాలకు, బలమైన ఉద్యమాలకు వ్యవస్థలు సైతం లొంగక తప్పదనే అంశానికి తాజా పరిణామాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీజేపీ సరికొత్త ఉద్యమానికి తెరలేపి, ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మరియు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పట్టుబట్టిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్యంగా దారిలోకి వచ్చింది. సీజేపీ డిమాండ్లు, దేశవ్యాప్త ఆందోళనల దెబ్బకు స్పందించిన ఎన్నికల సంఘం.. ‘సర్ ప్రక్రియ’ ముగిసిన రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రయోజనాల కోసం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఎంపిక చేసిన ఓటర్ల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా, తొలిసారిగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన యువతను గుర్తించడంతో పాటు, గతంలో ఓటు ఉండి ప్రస్తుతం విడుదల చేసిన నూతన ఓటర్ల జాబితాలో ఓటు కోల్పోయిన వారిని తక్షణమే గుర్తించి, వారి పేర్లను మళ్లీ ఓటర్లుగా నమోదు చేయాలని ఈసీ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కఠిన చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

సమాజంలో చిట్టచివరి వ్యక్తికి కూడా ఓటు హక్కు అందాలనే లక్ష్యంతో, ఈసీ ఈసారి సరికొత్త నిబంధనలను చేర్చింది. నిరుపేదలు, నిరాశ్రయులు, మరియు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓటర్ నమోదు శిబిరాలను నిర్వహించాలని ఆదేశించింది. సీజేపీ చేసిన ఉధృత పోరాటం వల్లే ఎన్నికల సంఘం ఈ స్థాయిలో దిగివచ్చి, సాధారణ ఓటర్ల జాబితా సవరణలతో పాటు వలస కార్మికులు, నిరాశ్రయులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, సీజేపీ పెట్టిన ఒత్తిడికి దెబ్బకు దారిలోకి వచ్చిన ఈసీ నిర్ణయం పట్ల సామాన్య ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

The post సీజేపీ ఉద్యమ దెబ్బకు దారిలోకి వచ్చిన ఈసీ..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జాతీయ వేదికలపై జగన్ మౌనం, పార్టీకి నష్టమే..?విజయనగరం టీడీపీలో చిన్న శ్రీను లేటెస్ట్ చిచ్చు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com