☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

టీటీడీ చైర్మన్ గారి మీద కోపంగా సీఎం గారు..!

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని అమరావతి వర్గాల నుండి లీకులు అందుతున్నాయి. రాబోయే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సమయానికి ఈ మార్పుపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని […] The post టీటీడీ చైర్మన్ గారి మీద కోపంగా సీఎం గారు..! appeared first on Telugu Rajyam.
టీటీడీ చైర్మన్ గారి మీద కోపంగా సీఎం గారు..!

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని అమరావతి వర్గాల నుండి లీకులు అందుతున్నాయి. రాబోయే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సమయానికి ఈ మార్పుపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు వైఖరి, వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా చైర్మన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వివాదాస్పద అంశాలు మరియు వ్యక్తిగత ఆరోపణలు తిరుమల పవిత్రతకు, అలాగే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారాయనే భావన అధిష్టానంలో వ్యక్తమైంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వివాదాలను అస్త్రంగా మార్చుకుని చైర్మన్ తక్షణ రాజీనామాకు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

కేవలం వివాదాలే కాకుండా, ఇటీవల టీటీడీ బోర్డు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, మరియు ఉన్నతాధికారులతో చైర్మన్ పాలనాపరమైన సమన్వయం సరిగా లేకపోవడం కూడా ఈ అసంతృప్తికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ల్యాండ్ స్వాప్ పాలసీలు, వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తదితర అంశాలపై బోర్డు నిర్ణయాలు వివాదాస్పదంగా మారడం.. భక్తులలో ఒక రకమైన గందరగోళానికి దారితీసింది. హిందూ సెంటిమెంట్లు దెబ్బతినకుండా, అత్యంత పారదర్శకంగా తిరుమల ప్రక్షాళన జరగాలని భావించిన సీఎం చంద్రబాబు.. ప్రస్తుత చైర్మన్ హయాంలో ఆశించిన మార్పు రాకపోగా మరిన్ని కొత్త తలనొప్పులు వస్తుండటంతో ఈ కఠిన నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు భోగట్టా.

ముందుగా ‘ముఖ్యమంత్రి చెబితేనే తాను రాజీనామా చేస్తానని’ ప్రస్తుత చైర్మన్ ప్రకటించిన నేపథ్యంలో.. బ్రహ్మోత్సవాలు ముగియగానే కొత్త బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ రేసులో కూటమికి చెందిన కొందరు సీనియర్ పారిశ్రామికవేత్తలు, మరియు వివాద రహితులైన పెద్ద మనుషుల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు, సాధారణ భక్తులకు పెద్దపీట వేసేలా సమర్థవంతంగా పనిచేసే నాయకుడికే ఈసారి పగ్గాలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

The post టీటీడీ చైర్మన్ గారి మీద కోపంగా సీఎం గారు..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఈడీ ఉచ్చులో వైఎస్సార్సీపీ ఎంపీలు..!ఏపీలో ఆ ముగ్గురే ఎమ్మెల్యేలా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com