☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!

CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీట మునగడం, నదుల్లో వరద ప్రవాహాలపై సీఎస్‌ సాయిప్రసాద్‌ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. […]
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!

CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీట మునగడం, నదుల్లో వరద ప్రవాహాలపై సీఎస్‌ సాయిప్రసాద్‌ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై ఇరిగేషన్‌ అధికారులు సమాచారం అందించారు.

హీర మండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్‌ పనులను పూర్తిచేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా సీఎం సమీక్షించారు.

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద కారణంగానే ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా వస్తున్న వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన బ్యారేజ్‌ నిర్మాణం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సీఎం ఆదేశించారు.

తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50% నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.8% వర్షపాతం లోటు ఉండగా.. రాయలసీమలో 42% లోటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్‌? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com