☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సీఎం విజయ్ షాకింగ్ డెసిషన్ : వ్యాపారవేత్త కేసు విచారణపై మహిళా పోలీసులతో సిట్

సీఎం విజయ్ షాకింగ్ డెసిషన్ : వ్యాపారవేత్త కేసు విచారణపై మహిళా పోలీసులతో సిట్
సీఎం విజయ్ షాకింగ్ డెసిషన్ : వ్యాపారవేత్త కేసు విచారణపై మహిళా పోలీసులతో సిట్
సీఎం విజయ్ షాకింగ్ డెసిషన్ : వ్యాపారవేత్త కేసు విచారణపై మహిళా పోలీసులతో సిట్

తమిళనాడు సీఎం విజయ్ ఏ డెసిషన్ తీసుకున్నా సంచలనంగానే ఉంటోంది. లేటెస్టుగా ఒక చిన్నారిపై జరిగిన అత్యాచార కేసులో మహిళా పోలీసులతో సిట్ ఏర్పాటు చేసి మరోసారి డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్ వీరమణిపై అత్యాచార ఆరోపణల కేసు, దానికి సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించి ఏర్పరిచిన సిట్ లో కేవలం మహిళా అధికారులే ఉండటం పోలీస్ డిపార్ట్మెంటునే ఆశ్చర్యానికి గురిచేసింది.

జెమ్ గ్రానైట్స్ చైర్మన్ ఆర్. వీరమణిపై బాలలపై లైంగిక నేరాల ఆరోపణలపై విచారణ కోసం చెన్నై పోలీసులు నలుగురు మహిళలతో కూడిన ప్రత్యేక విచారణ బృందం సిట్ ను ఏర్పాటు చేశారు.

చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదనపు పోలీసు కమిషనర్ పిసి తెన్మోజి నేతృత్వంలో ఈ ఎస్ఐటికి నాయకత్వం వహిస్తారు. ఇతర సభ్యులుగా వెస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ ఎన్. దిశా మిట్టల్, పోలీసు సూపరింటెండెంట్ ముత్తరసి , సెంట్రల్ విమెన్ అండ్ చిల్డ్రన్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ గీతాంజలి ఈ సిట్ లో ఉన్నారు.

బాలలపై అత్యాచార కేసులో 2026 ఆగస్టు 29న వీరమణి, శాంతి, మహేంద్ర సింహన్‌లను అరెస్టు చేశారు. తర్వాత జెమ్ గ్రానైట్స్ మాజీ ఉద్యోగి గణేశన్‌ను సెప్టెంబర్ 22న అతని మొబైల్‌లో కేసుకు సంబంధించిన వీడియో దొరకడంతో అరెస్టు చేశారు. ఆ వీడియో ఎలా వచ్చింది, పోలీసులకు ఎందుకు తెలియజేయలేదని విచారిస్తున్నారు.

కేసు విస్తరిస్తున్న క్రమంలో సిట్ ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, ప్రకటనలు, డిజిటల్ మెటీరియల్‌ను పరిశీలిస్తూ సిట్ విచారణను కొనసాగిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← జపాన్‌పై భారత్ చీటింగ్ చేసి గెలిచిందా?.. ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో చెప్పిన మాజీ క్రికెటర్!సిక్కింలో దడ పుట్టిస్తున్న వర్షాలు.. ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచర్యలు.. ధ్వంసమైన ఇళ్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com