☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇన్సులిన్‌ ఆపమన్నారని ఫిర్యాదు.. వీఆర్‌కే హెల్త్‌కేర్‌పై కేసు!

ఇన్సులిన్‌ ఆపమన్నారని ఫిర్యాదు.. వీఆర్‌కే హెల్త్‌కేర్‌పై కేసు!‘డైట్‌తో టైప్‌–1 డయాబెటిస్‌ శాశ్వతంగా నయం’ ప్రచారంపై రోగి ఆరోపణలుఇన్సులిన్‌ నిలిపివేసిన రెండు రోజుల్లోనే ఆస్పత్రిపాలయ్యానన్న సాయికృష్ణడైట్‌, సప్లిమెంట్లకు సుమారు రూ.26 వేలు.. ఆస్పత్రి చికిత్సకు రూ.58,219 ఖర్చువైద్య అర…
ఇన్సులిన్‌ ఆపమన్నారని ఫిర్యాదు.. వీఆర్‌కే హెల్త్‌కేర్‌పై కేసు!
ఇన్సులిన్‌ ఆపమన్నారని ఫిర్యాదు.. వీఆర్‌కే హెల్త్‌కేర్‌పై కేసు!

‘డైట్‌తో టైప్‌–1 డయాబెటిస్‌ శాశ్వతంగా నయం’ ప్రచారంపై రోగి ఆరోపణలు

  • ఇన్సులిన్‌ నిలిపివేసిన రెండు రోజుల్లోనే ఆస్పత్రిపాలయ్యానన్న సాయికృష్ణ
  • డైట్‌, సప్లిమెంట్లకు సుమారు రూ.26 వేలు.. ఆస్పత్రి చికిత్సకు రూ.58,219 ఖర్చు
  • వైద్య అర్హతలు, కేంద్రం అనుమతులపై దర్యాప్తు కోరుతూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు
ప్రజాచౌరస్తా / శేరిలింగంపల్లి, రాయదుర్గం : టైప్‌–1 డయాబెటిస్‌ను ‘వీఆర్‌కే డైట్‌’తో శాశ్వతంగా నయం చేయవచ్చని చెప్పి, ఇన్సులిన్‌ వాడకం నిలిపివేయించారంటూ వీఆర్‌కే హెల్త్‌కేర్‌ సెంటర్‌పై సాయికృష్ణ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సూచనలు పాటించిన రెండు రోజుల్లోనే ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాయికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన 2018 నుంచి టైప్‌–1 డయాబెటిస్‌తో బాధపడుతూ ఇన్సులిన్‌ వాడుతున్నారు. 2025 సెప్టెంబర్‌ 12న షేక్‌పేట్‌లోని వీఆర్‌కే హెల్త్‌కేర్‌ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఇన్సులిన్‌ నిలిపివేసి ‘వీఆర్‌కే డైట్‌’ పాటించాలని సూచించారని ఆరోపించారు. డైట్‌, సప్లిమెంట్ల కోసం సుమారు రూ.26 వేలు చెల్లించినట్లు తెలిపారు.

ఇన్సులిన్‌ ఆపిన తర్వాత రెండు రోజుల్లోనే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, వాంతులు, ఒళ్లునొప్పులు రావడంతో సెప్టెంబర్‌ 14న కిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు వివరించారు. అక్కడ వైద్యులు డయాబెటిక్‌ కీటో ఆసిడోసిస్‌ (డీకేఏ), తీవ్రమైన డీహైడ్రేషన్‌ ఉన్నట్లు నిర్ధారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చికిత్స కోసం రూ.58,219 ఖర్చయిందని తెలిపారు.

ఈ వ్యవహారంలో వీరమచినేని రామకృష్ణ, డాక్టర్‌ కోటేశ్వరరావుతోపాటు కేంద్రానికి చెందిన ఇతరుల పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సాయికృష్ణ కోరారు. ఇన్సులిన్‌ నిలిపివేయడం, తనకు డీకేఏ రావడం మధ్య సంబంధాన్ని వైద్య రికార్డుల ఆధారంగా స్వతంత్ర డయాబెటిస్‌ నిపుణుడితో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

డాక్టర్‌ కోటేశ్వరరావు వైద్య అర్హతలు, ఇన్సులిన్‌ నిలిపివేయాలని సూచించే అధికారం, కేంద్రం రిజిస్ట్రేషన్లు, అనుమతులు, లైసెన్సులను పరిశీలించాలని కోరారు. విక్రయించిన సప్లిమెంట్ల చట్టబద్ధతపైనా దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు. ఇదే తరహా సూచనలు పొందిన ఇతర టైప్‌–1 డయాబెటిస్‌ రోగులు ఉన్నారా? వారి నుంచి ఎంత వసూలు చేశారు? అనే అంశాలను కూడా పరిశీలించాలని కోరారు.

ఈ విషయమై నాంపల్లిలోని వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించినట్లు సాయికృష్ణ తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలు, వైద్య సూచనలు, ఆరోగ్యం క్షీణించడానికి కారణాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.


⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!IND vs SL Semi-Final: భారత్‌ vs శ్రీలంక సెమీఫైనల్‌.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్‌, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com