☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

VRK డైట్ వివాదం.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

VRK డైట్ వివాదం.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు Caption of Image. హైదరాబాద్: VRK డైట్‌ వ్యవస్థాపకుడు, డైటీషియన్‌గా ప్రచారంలో ఉన్న వీరమాచినేని రామకృష్ణపై రాయదుర్గం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు . సాయికృష్ణ ఆరోపణల ప్రకారం VRK హెల్త్ కేర్ సెంటర్‌లో తనకు ఇన్సులిన్ నిలిపివేసి వీఆర్ కే డైట్, సప్లిమెంట్లు సూచించడంతో ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం.. 2018 నుంచి తాను టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నానని, ఇన్సులిన్‌పై ఆధారపడుతున్నానని తెలిపారు. వీఆర్ కే డైట్‌కు సంబంధించిన సోషల్ మీడియా వీడియోలను చూసిన అనంతరం 2025 సెప్టెంబర్‌లో రాయదుర్గం పరిధిలో
VRK డైట్ వివాదం.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
VRK డైట్ వివాదం.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

హైదరాబాద్: VRK డైట్‌ వ్యవస్థాపకుడు, డైటీషియన్‌గా ప్రచారంలో ఉన్న వీరమాచినేని రామకృష్ణపై రాయదుర్గం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు . సాయికృష్ణ ఆరోపణల ప్రకారం VRK హెల్త్ కేర్ సెంటర్‌లో తనకు ఇన్సులిన్ నిలిపివేసి వీఆర్ కే డైట్, సప్లిమెంట్లు సూచించడంతో ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం.. 2018 నుంచి తాను టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నానని, ఇన్సులిన్‌పై ఆధారపడుతున్నానని తెలిపారు. వీఆర్ కే డైట్‌కు సంబంధించిన సోషల్ మీడియా వీడియోలను చూసిన అనంతరం 2025 సెప్టెంబర్‌లో రాయదుర్గం పరిధిలోని వీఆర్ కే హెల్త్ కేర్ సెంటర్‌ను సంప్రదించినట్లు చెప్పారు. అక్కడ తనకు ఇన్సులిన్ కొనసాగించకుండా వీఆర్ కే డైట్‌ను అనుసరించాలని సూచించారని, సప్లిమెంట్లు, డైట్ సేవల కోసం సుమారు రూ.26 వేల వరకు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను దర్యాప్తులో పోలీసులు పరిశీలించనున్నారు.

ఇన్సులిన్ నిలిపివేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు వాంతులు, శరీర నొప్పి వంటి సమస్యలు తలెత్తాయని సాయికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని KIMS ఆసుపత్రిలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA), తీవ్రమైన డీహైడ్రేషన్‌తో చికిత్స పొందినట్లు తెలిపారు. ఆసుపత్రి చికిత్సకు సుమారు రూ.58 వేల వరకు ఖర్చయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు BNSలోని 318(4), 125(a), 61(2) సెక్షన్లతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్‌లోని సెక్షన్ 54, Drugs and Magic Remedies (Objectionable Advertisements) Act, 1954లోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

వీఆర్ కే డైట్ పై కోర్టుకెక్కిన HRDA

మరో వైపు వైద్య అర్హతలు లేని వ్యక్తులు మెడికల్ అడ్వైజ్ ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ వీఆర్ కే డైట్ పై హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA) కోర్టును ఆశ్రయించింది. VRK డైట్‌తో డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన వ్యాధులు నయం అవుతాయంటూ ప్రచారం చేస్తున్నారని డాక్టర్ల సంఘం ఆరోపించింది.

VRK డైట్‌కు సంబంధించిన కంటెంట్‌లో ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులను నిలిపివేయాలని సూచించిన సందర్భాలు ఉన్నాయని HRDA ఆరోపించింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇటువంటి సూచనలు చేయడం వల్ల రోగుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సంఘం తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.డయాబెటిస్‌తో పాటు క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ తదితర తీవ్రమైన వ్యాధులకు VRK డైట్ ద్వారా ‘క్యూర్’ సాధ్యమవుతుందంటూ క్లెయిమ్స్ చేశారని డాక్టర్ల సంఘం ఆరోపించింది.

అలోపతి వైద్యం, వైద్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు, పోస్టులు, రీల్స్‌ ద్వారా కంటెంట్ ప్రచారం చేశారని HRDA ఆరోపించింది. ఈ కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి మెడికల్ కంటెంట్‌ను ప్రచారం చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోర్టును కోరింది.ఈ వ్యవహారంలో VRKతో పాటు సంబంధిత సోషల్ మీడియా, డిజిటల్, మీడియా సంస్థలు, వ్యక్తులను కలిపి మొత్తం 23 మందిని ప్రతివాదులుగా చేర్చింది. వివాదాస్పదంగా పేర్కొంటున్న వీడియోలు, పోస్టులు, రీల్స్‌ను తొలగించడంతో పాటు వాటి మరింత ప్రసారాన్ని నిలిపివేయాలని డాక్టర్ల సంఘం కోర్టును కోరింది.VRK డైట్‌కు సంబంధించిన వైద్య సలహాలు, తీవ్రమైన వ్యాధులపై చేస్తున్నట్లు ఆరోపిస్తున్న ‘క్యూర్’ క్లెయిమ్స్, మందుల వినియోగంపై ఇచ్చిన సూచనలు తదితర అంశాలపై కోర్టులో విచారణ కొనసాగనుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దసరా, గాంధీ జయంతి వేళ.. అక్టోబర్‌లో 15 రోజులు బ్యాంక్ బంద్!స్కూళ్లలో AI వాడకానికి జైకొడుతున్న టీనేజర్లు..అయితే రూల్స్ తప్పనిసరి అంటున్న స్టూడెంట్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com