☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది రెండు ప్లేట్స్ లాగిస్తారు

పెసర గారెలు, సంప్రదాయ ఆంధ్ర వంటకాల్లో ఒకటి. ఇవి మినప గారెల కంటే తేలికగా, రుచిగా, తక్కువ నూనెతో చేసుకోవచ్చు. ముఖ్యంగా, నూనె పీల్చకుండా కరకరలాడే గారెలు ఈ వంటకం ప్రత్యేకత. దీనికి ఘాటైన కారం చట్నీ తింటే, ఉదయం టిఫిన్, సాయంత్రం పూట అల్పాహారం మరింత కమ్మగా మారుతుంది. ఈ రెసిపీలో పెసర గారెలు, కారం చట్నీ తయారీ విధానాన్ని ఇక్కడ చూద్దాం..
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది రెండు ప్లేట్స్ లాగిస్తారు
Pesara Garelu 1

పెసర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు - 400 గ్రాములు , తరిగిన ఉల్లిపాయలు - 1 పెద్దది, అల్లం - 1 అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 6, తరిగిన కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - అర చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి. 400 గ్రాముల పెసరపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి. మిక్సీలో రుబ్బుకోవడానికి మూడు గంటలు నానబెట్టడం ముఖ్యం, లేదంటే పిండి గట్టిగా వస్తుంది. ఒకవేళ గ్రైండర్‌లో రుబ్బాలి అనుకుంటే రెండు గంటలు సరిపోతుంది.

Pesara Garelu 2

పప్పు బాగా నానిన తర్వాత, దానిని శుభ్రంగా కడిగి, చిల్లుల గిన్నెలో వేసి 10-15 నిమిషాల పాటు నీళ్లు పూర్తిగా వాడే వరకు ఉంచాలి. పిండి లూజ్‌గా అవ్వకుండా ఉండటానికి ఇది చాలా అవసరం. ఈ దశలో సుమారు రెండు చెంచాల నానిన పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి. ఇది గారెలకు మంచి ఆకృతినిస్తుంది.

Pesara Garelu 3

అదే సమయంలో, ఒక మిక్సీ జార్‌లో అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది గారెలకు మంచి రుచిని, ఘాటును ఇస్తుంది.ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో నీరు వాడిన పెసరపప్పును కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, చేతికి కొద్దిగా రవ్వ రవ్వగా తగిలేలా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బితే గారెలు ఆకృతిని పట్టుకోవు. రుబ్బుతున్నప్పుడు నీళ్లు కలపకుండా చూసుకోవాలి, పిండి గట్టిగా ఉండాలి.

Pesara Garelu 4

రుబ్బిన పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పక్కన పెట్టుకున్న పప్పు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మరియు కచ్చాపచ్చాగా రుబ్బిన అల్లం-పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవచ్చు. గారెలు వత్తడానికి అరిటాకు, కవర్ లేదా బటర్ పేపర్‌ను ఉపయోగించవచ్చు. చేతిని నీళ్లతో తడిపి, కొద్దిగా పిండి తీసుకుని, అరిటాకుపై పల్చగా వత్తి, మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. గారెలు పల్చగా ఉంటేనే నూనె పీల్చకుండా, కరకరలాడతాయి.

Pesara Garelu 5

డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, వత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒకవేళ చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే, అట్లకాడ వంటి గరిటెను ఉపయోగించి దానిపై వత్తి నూనెలో వేయాలి. గారెలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, నూనె నుండి తీసివేయాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించడం వల్ల అవి లోపల వరకు ఉడికి, నూనె పీల్చుకోవు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్, ఫిర్యాదులకు 2 గంటల్లో పరిష్కారం!Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే ఇవ్వాలి.. కౌశల్ మరో వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com