☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!

Dasara Festival 2026 : ఈ దసరా పండుగ రోజున మూడు ప్రత్యేక పరిహారాలు నిర్వహిస్తే ధనం బాధలు తొలగిపోతాయని.. విజయాలు చేకూరుతాయని.. ప్రశాంతత లభిస్తుందని పలువురు పండితులు చెబుతున్నారు. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!

Dasara Festival 2026 : దసరా సనాతన ధర్మంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. విజయదశమి అని కూడా పిలిచే ఈ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది 20వ తేదీన దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున విజయ ముహూర్తంలో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయాలను పొందుతారని విశ్వాసం.

Also Read : Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు

జీవితంలో ఎదురవుతున్న బాధల నుంచి ఉపశమనం పొందేందుకు దసరా పండుగ రోజున అనేక మంది పలు పరిహారాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ దసరా పండుగ రోజున మూడు ప్రత్యేక పరిహారాలు నిర్వహిస్తే ధనం బాధలు తొలగిపోతాయని.. విజయాలు చేకూరుతాయని.. ప్రశాంతత లభిస్తుందని పలువురు పండితులు చెబుతున్నారు. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

♦ జమ్మి చెట్టు పరిహారం (ధనాభివృద్ధి కోసం) : ధనాభివృద్ధికోసం ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టు పరిహారం చేస్తే ఎంతో మేలు చేస్తుందని పలువురు పండితులు చెబుతున్నారు. ముందుగా.. విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టు (శమీ వృక్షం) దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. నెయ్యి దీపం వెలిగించి.. ఆ తరువాత ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ’.. అనే శ్లోకాన్ని మనసులో తలచుకోవాలి. పూజ చేసిన తరువాత కొన్ని జమ్మి ఆకులను తెచ్చి మీ ఇంట్లోని పూజా గదిలో లేదంటే డబ్బులు దాచే బీరువాలో పెట్టుకోవాలి. ఈ పరిహారం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు.

♦ అపరాజతా దేవి పూజ (విజయం కోసం) : దసరా రోజున అపరాజతా దేవి పూజ చేయడం ద్వారా మన వృత్తిలో విజయాలు సిద్ధిస్తాయని, మనం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయాలంటే.. దసరా రోజున మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వేళల్లో మీ ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేయండి అమ్మవారి దుర్గా రూపమైన అపరాజతా దేవిని మనసులో ధ్వనించండి. వీలైతే నీలి రంగు శంఖం పువ్వులతో అమ్మవారికి అర్చన చేయండి. ఇలా చేయండ వల్ల చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుందని సంప్రదాయ విశ్వాసం. శత్రు బాధలు తగ్గి, కొత్త పనుల్లో శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

♦ రాతి ఉప్పు పరిహారం (ఇంట్లో ప్రశాంతత కోసం) : దసరా పండుగ రోజున రాతి ఉప్పు పరిహారం చేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇందుకోసం.. దసరా పండుగ రోజు రాత్రి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఒక చిన్ని గాజు గిన్నెను తీసుకొని అందులో రెండు కప్పులు రాతి ఉప్పు వేయండి. దానిపై 4 లవంగాలు ఉంచండి. ఈ గిన్నెను మీ ఇంటి నైరుతి మూలలో ఎవరికి తగలకుండా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు, నరదృష్టి తొలగి ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. ఇంట్లో సానుకూల శక్తి పెరిగి.. లక్ష్మిదేవి స్థిర నివాసం ఏర్పర్చుకుంటుందని భావిస్తారు.

గమనిక : ఈ పరిహారాలను 10టీవీ ధృవీకరించడం లేదు. కేవలం కొందరు పండితులు సూచనలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఈ పరిహారాలను ఆచరించే ముందు మీకు తెలిసిన పండితుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచన.

⬇ Full News JPG⬇ Short News JPG
← PV Sindhu : పీవీ సింధు బతుకమ్మ సెలబ్రేషన్స్.. ఫొటోలు..Supritha : తల్లి సురేఖవాణితో కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన సుప్రీత.. ఫొటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com