☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..

Delhi Protest: ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను (ముళ్ల కంచెలు/బల్లెపు ముళ్లు ఉన్న స్ట్రిప్స్) కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిషిద్ధ ప్రాంతాల వైపు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మోహన్ కోఆపరేటివ్ ఎస్టేట్ ప్రాంతంలో పోలీసులు భారీ కాపలా కాస్తూ, ప్రతి కార్‌ను క్షుణ్ణం
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..

Delhi Protest: ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను (ముళ్ల కంచెలు/బల్లెపు ముళ్లు ఉన్న స్ట్రిప్స్) కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిషిద్ధ ప్రాంతాల వైపు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మోహన్ కోఆపరేటివ్ ఎస్టేట్ ప్రాంతంలో పోలీసులు భారీ కాపలా కాస్తూ, ప్రతి కార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ ముందుకు వెళ్లనివ్వట్లేదని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఫామ్ 6 మార్పుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సీజేపీ తరఫున ఇలాంటి ఆందోళన జరగడం ఇది రెండోసారి. మరోవైపు, ఈ నిరసనలను అణచివేయడానికి పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ధ్రువ్ రాఠీ, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే విమానం నుంచి దిగుతుండగా పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లతో పాటు సీజేపీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు, నగరవ్యాప్తంగా దాదాపు 500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 20 వేలకు పైగా పోలీసులను, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రంగంలోకి దించింది. ఈ నిరసనల ఎఫెక్ట్ రవాణా రంగంపై కూడా గట్టిగానే పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను పోలీసులు కోరారు. దీంతో డీఎంఆర్సీ ఏకంగా 45 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. అలాగే శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన ఇతర రాష్ట్రాల రైళ్లు, లోకల్ ట్రైన్లు కలిపి మొత్తం 250కి పైగా రైళ్లను రద్దు చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com