☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..

BJP: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు పదునెక్కాయి. సభకు 10 లక్షల మంది హాజరవుతారని రాహుల్ గాంధీ చెబుతుంటే, పోలీసులు మాత్రం 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీని మళ్లీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ర్యాలీ జరుగుతోందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీ బీజేపీ ఈ ర్యాలీని ‘గుండాల […]
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..

BJP: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు పదునెక్కాయి. సభకు 10 లక్షల మంది హాజరవుతారని రాహుల్ గాంధీ చెబుతుంటే, పోలీసులు మాత్రం 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీని మళ్లీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ర్యాలీ జరుగుతోందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీ బీజేపీ ఈ ర్యాలీని ‘గుండాల జాతర’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీని ఆదివారం కూడా ఖాళీగా ఉండకుండా చూసేందుకు మరో ఖరీదైన ప్రచార కార్యక్రమమని బీజేపీ విమర్శిస్తోంది.

పంజాబ్‌ బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్‌గిల్ ఇండియా కూటమి ర్యాలీపై మాట్లాడుతూ.. ఓట్ల చోరీ జరిగితే రాహుల్ గాంధీ రెండు చోట్ల ఎలా గెలిచారు? అని ప్రశ్నించారు. ఆయన రాజీనామా చేసిన వయనాడ్‌లో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఎలా గెలిచారని అడిగారు. కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉండటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తమిళనాడులో 59 ఏళ్లు, పశ్చిమ బెంగాల్‌లో 49 ఏళ్లుగా, సిక్కింలో 42 ఏళ్లుగా, ఉత్తరప్రదేశ్‌లో 37 ఏళ్లుగా, బీహార్‌లో 36 ఏళ్లుగా, గుజరాత్‌లో 30 ఏళ్లుగా, ఒడిశాలో 26 ఏళ్లుగా, నాగాలాండ్‌లో 23 ఏళ్లుగా, మహారాష్ట్రలో 12 ఏళ్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Robbery: ఆన్‌లైన్‌లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com