☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

విమానం సీట్ల కింద నుంచి గుప్పుమన్న అత్తరు వాసన.. అనుమానంతో తెరిచి చూస్తే..!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సీట్ల కింద దాచిన సుమారు 6.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ సహా మొత్తం 8 మంది అనుమానిత స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
విమానం సీట్ల కింద నుంచి గుప్పుమన్న అత్తరు వాసన.. అనుమానంతో తెరిచి చూస్తే..!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సీట్ల కింద దాచిన సుమారు 6.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ సహా మొత్తం 8 మంది అనుమానిత స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు తెలిపారు. బంగారాన్ని గుర్తించకుండా ఉండేందుకు దానిపై స్ప్రే రంగులు పూసి, చైన్ల రూపంలో మార్చినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం విమానంలోని సీట్ల కింద వాటిని దాచినట్లు అధికారులు వెల్లడించారు.

దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అధికారులకు అనుమానం రావడంతో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో దాచిన బంగారం బయటపడింది. మొత్తం 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని విలువను సుమారు రూ.9 కోట్లుగా అంచనా వేశారు.

విచారణలో నిందితులు ఎగ్జిబిషన్ వ్యాపారం పేరుతో తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రయాణాలను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ముఠాకు దుబాయ్‌లో ఉన్న సంబంధాలు, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, గతంలో ఎన్ని సార్లు ఇదే తరహాలో అక్రమ రవాణా చేశారనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

బంగారం సీజ్ అనంతరం అరెస్టయిన ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? దుబాయ్ నుంచి బంగారం తీసుకువచ్చిన వ్యక్తులు, ఢిల్లీలో దానిని స్వీకరించాల్సిన వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు మరింత సమాచారం సేకరిస్తున్నాయి. తాజా సీజ్‌తో ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాపై భద్రతా, కస్టమ్స్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కళింగపట్నం వైపు దూసుకువస్తున్న తుఫాన్.. 3 రోజులపాటు భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్Bigg Boss : బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. రూ.5 లక్షలు మోసం చేసిందని యువకుడు ఫిర్యాదు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com