☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!

Delhi:ఢిల్లీలో వరస నిరసనలు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల వల్ల వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేతృత్వంలో ఆదివారం, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండింయా కూటమి భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలపై ఈ ర్యాలీ జరుగుతోంది. దీపావళి పండగ ముందు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల ఢివల్లలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని, 80 శాతం వ్యాపారాలు […]
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!

Delhi:ఢిల్లీలో వరస నిరసనలు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల వల్ల వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేతృత్వంలో ఆదివారం, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండింయా కూటమి భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలపై ఈ ర్యాలీ జరుగుతోంది.

దీపావళి పండగ ముందు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల ఢివల్లలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని, 80 శాతం వ్యాపారాలు నిలిచిపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆరోపించింది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి CTI నాలుగోసారి లేఖ రాసింది. రామ్‌లీలా మైదాన్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందని, దీంతో ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, వరసగా వ్యాపారస్తులు రాహుల్ గాంధీకి విన్నవిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్నవారు, చిరు వ్యాపారుల వద్ద షాపింగ్ చేయాలని కోరారు. దీని వల్ల వారి వ్యాపారాలు బాగుంటాయని అన్నారు. వ్యాపారాలు నష్టపోతున్నాయని బీజేపీ అపోహలు సృష్టిస్తోందని రాహుల్ ఆరోపించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com