☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

‘వైద్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలి’

ఏన్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రదీప్ బాబు శుక్రవారం సందర్శించారు. పీహెచ్‌సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను...
‘వైద్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలి’

– ఏన్కూరు పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్ర‌దీప్‌బాబు తనిఖీ
– జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పరిశీలన
– సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన

కారేపల్లి (ఏన్కూరు), సెప్టెంబర్ 25 : ఏన్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రదీప్ బాబు శుక్రవారం సందర్శించారు. పీహెచ్‌సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు. ప్రస్తుతం ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు,చికిత్సలు, ఇతర వైద్య సదుపాయాలను సకాలంలో అందించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ తనిఖీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బాలకృష్ణతో పాటు ఆస్ప‌త్రి సిబ్బంది పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gautam Gambhir | వరల్డ్‌కప్‌లో ఆ ఇద్దరు చాలా ముఖ్యం.. శాంసన్‌పై వేటుతో నిద్రపోలే..!Kayadu Lohar | ‘ది ప్యారడైజ్’లో కయాదు లోహర్ పాత్రపై విమర్శలు.. శ్రీకాంత్ ఓదెలకి నెటిజన్ల ప్రశ్నలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com