☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి పరువు నష్టం కేసులో ఇబ్బందులు మరింత పెరిగాయి. గురుగ్రామ్‌లోని ఇంటి ప్రధాన గేటుపై ఢిల్లీ సాకేత్ కోర్టు సమన్లను అంటించారు. బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు వికాస్ సాకృత్యాయన్ అలియాస్ వికాస్ పాండే దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి ఈ పరిణామం చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్-56 లో ఉన్న కేంద్రీయ విహార్ సొసైటీలో ఉన్న ధ్రువ్ రాఠీ ఇంటి గేటుపై ఈ నోటీసును అతికించారు. కోర్టు సిబ్బందితో పాటు ఫిర్యాదుదారుడు స్వయంగా వెళ్లి ఈ సమన్లను జారీ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. రాఠీకి నేరుగా అందజేయడానికి వీలుపడకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇంటి గేటుపైనే ఈ నోటీసును అంటించి సమాచారం అందించారు.

ఈ వివాదం మూలాలు 2018 నాటి ఓ వీడియోలో ఉన్నాయి. ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ పేరుతో అప్పట్లో అప్‌లోడ్ చేసిన ఆ వీడియోలో తమపై, బీజేపీ ఐటీ సెల్ పై నిరాధార ఆరోపణలు చేశారని వికాస్ పాండే ఫిర్యాదులో పేర్కొన్నారు. వికాస్ పాండే ద్వారా మహావీర్ ప్రసాద్ అనే వ్యక్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని, అంతేకాకుండా ధ్రువ్ రాఠీని బద్నాం చేయడానికి రూ.50 లక్షలు ఆశ చూపారంటూ ఆ వీడియోలో తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిరాధార ఆరోపణలు తన వ్యక్తిగత, సామాజిక ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయని వికాస్ పాండే తెలిపారు. 2019 జూలైలోనే ఈ కేసుకు సంబంధించి మొదటిసారి సమన్లు జారీ అయినప్పటికీ, ఇప్పటివరకు అవి ఆయనకు అందలేదు. ధ్రువ్ రాఠీ ఆస్ట్రియాలో నివసిస్తుండటం, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడమే ఇందుకు కారణం. అయితే, ఆయన ప్రస్తుతం భారత్‌లోని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే ఉన్నట్లు సమాచారం అందడంతో కోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో జెండా వందన నిరసన కార్యక్రమం చర్చనీయాంశంగా మారగా, ఈ కార్యక్రమంలో ధ్రువ్ రాఠీ కూడా పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ అక్టోబర్ 17న జరగనుండటంతో అందరి దృష్టి కోర్టు తీర్పుపైనే నిలిచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com