Rahul Ramakrishna: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంటున్నప్పటికీ, సినిమాలో నటుడు ప్రియదర్శి పాత్రకు మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ‘ఎమ్మెల్యే శంకరన్న’ అనే పూర్తి స్థాయి మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని గుర్తుచేసేలా ప్రియదర్శి ప్రదర్శించిన హావభావాలు, గెటప్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులు మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read Also : Nani The Paradise: ది ప్యారడైజ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన నటి.. ఎవరో తెలిస్తే షాక్!
Rahul Ramakrishna: కేసీఆర్ శైలిలోనే ప్రియదర్శి ఫన్నీ రిప్లై
ప్రియదర్శి అద్భుత నటనపై తోటి నటుడు, మిత్రుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రియదర్శి గెటప్‌ను ఉద్దేశిస్తూ “బాపూ.. ఇచ్చి పడేసినావు” అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనికి ప్రియదర్శి కూడా ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్ గతంలో ఓ బహిరంగ సభలో అన్న ఫేమస్ మాటలను గుర్తుచేస్తూ రిప్లై ఇచ్చారు. “ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే” అంటూ తెలంగాణ యాసలో అత్యంత సరదాగా సమాధానమిచ్చారు.
వీరిద్దరి మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రియదర్శి రిప్లైపై నెటిజన్లు, ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. సినిమాలో కేసీఆర్ రీక్రియేషన్ బాగుందని మెచ్చుకోవడంతో పాటు, రియల్ లైఫ్‌లోనూ వారిద్దరి కామిక్ టైమింగ్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :




