☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఉచిత డయాలసిస్.. కాగితాలకే పరిమితం.. పరికరాలు, సిబ్బంది లేక మిర్జాపూర్ సీహెచ్ సీలో జాప్యం!

పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత డయాలసిస్ సెంటర్ కాగితాలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ బి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏడాది క్రితం మంజూరైన ఐదు పడకల డయాలసిస్ కేంద్రం నేటికీ తెరుచుకోలేదు.
ఉచిత డయాలసిస్.. కాగితాలకే పరిమితం.. పరికరాలు, సిబ్బంది లేక మిర్జాపూర్ సీహెచ్ సీలో జాప్యం!

జహీరాబాద్, సెప్టెంబర్ 25 : పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత డయాలసిస్ సెంటర్ కాగితాలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ బి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏడాది క్రితం మంజూరైన ఐదు పడకల డయాలసిస్ కేంద్రం నేటికీ తెరుచుకోలేదు. పరికరాలు లేవు, సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రానికి విశేష స్పందన వచ్చింది. అక్కడ ప్రతిసారి కొత్త కిట్ తో నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో మిర్జాపూర్ బిలో సీహెచ్ సీకి 5 పడకలు మంజూరు చేశారు. కానీ ఏడాది గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అయ్యే డయాలసిస్ కోసం ప్రైవేటుకు వెళ్తే ఒక్కసారికి రూ.4 వేల నుంచి 5 వేలు చెల్లించాల్సి వస్తోంది. వారానికి రెండు సార్లు చేయించుకోవాల్సిన పేదలు అప్పులు చేసి మరీ చేయించుకుంటున్నారు. చేతిలో డబ్బు లేక కొందరు డయాలసిస్ చేయించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

జహీరాబాద్ లో ఉన్న 10 పడకల కేంద్రంలో 34 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మిర్జాపూర్ లో కేంద్రం ప్రారంభమైతే న్యాల్కల్, రాయికోడ్, కోహిర్, నారాయణఖేడ్, కంగ్టి మండలాలకు చెందిన వందలాది మంది రోగులకు ఊరట లభిస్తుంది. 70 కిలోమీటర్లు తిరిగి జహీరాబాద్ వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మిర్జాపూర్ బిలో సీహెచ్ సీలో పరికరాలు, సిబ్బందిని నియమించి డయాలసిస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించాలని బాధితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nepal PM Balendra: ఆ వ‌ర‌ద‌లు హిమాల‌య‌న్ సునామీ.. యూఎన్ అసెంబ్లీలో నేపాల్ ప్ర‌ధానిమల్లారెడ్డికి ఆస్ట్రేలియాలో ఘన స్వాగతం.. బ్రిస్బేన్‌లో బీఆర్ఎస్‌ నేతల ఆత్మీయ స్వాగతం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com