☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Donald Trump : అయ్యో ట్రంప్.. అంత భయమెందుకు..! జిన్‌పింగ్ మాత్రం కూల్‌గా.. వీడియో వైరల్.. నెట్టింట నెటిజన్ల సెటైర్లు..

Donald Trump : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికే సమయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
Donald Trump : అయ్యో ట్రంప్.. అంత భయమెందుకు..! జిన్‌పింగ్ మాత్రం కూల్‌గా.. వీడియో వైరల్.. నెట్టింట నెటిజన్ల సెటైర్లు..

Donald Trump : అమెరికాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఈ స్వాగత కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్‌ పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆకాశంలో బాంబర్‌ విమానాలు దూసుకెళ్లగానే ఒక్కసారిగా తల వంచి, ముఖం చిట్లించిన దృశ్యాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Also Read : 22A Lands Registration : గుడ్‌న్యూస్.. ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు.. 22ఏ నిషేధిత జాబితాలోని భూములకూ రిజిస్ట్రేషన్లు..

అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో బుధవారం జిన్‌పింగ్‌కు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. జిన్‌పింగ్‌, ఆయన భార్య పెంగ్‌ లియువాన్‌ను స్వయంగా ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ కలిసి ఆహ్వానించారు. సుమారు 100 అడుగుల పొడవైన రెడ్‌ కార్పెట్‌, 21 మంది సభ్యులతో గౌరవ వందనం, అమెరికా-చైనా జాతీయ జెండాలు, ఎయిర్‌ఫోర్స్‌ బ్యాండ్‌ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆకాశంలో రెండు బీ-1 లాన్సర్‌ బాంబర్‌ విమానాలు భారీ శబ్దంతో దూసుకెళ్లాయి. విమానాలు మీదుగా వెళ్లే సమయంలో ట్రంప్‌ సెల్యూట్‌ చేస్తూ ఉండగా.. వాటి శబ్దానికి ఒక్కసారిగా తల వంచారు. పళ్లు బిగించి, ముఖం చిట్లిస్తూ విమానాల వైపు చూసినట్లు వీడియోలో కనిపించింది. మరోవైపు.. జిన్‌పింగ్ మాత్రం ప్రశాంతంగా కనిపించారు. బాంబర్లు వెళ్లిపోతున్న దిశగా ఆయన చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత జిన్‌పింగ్‌తో మాట్లాడుతూ అది చాలా పెద్ద శబ్దం అంటూ ట్రంప్‌ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. అయితే, జిన్‌పింగ్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోనట్లుగా కనిపించింది.

అతి భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్న సమయంలో ట్రంప్‌ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ట్రంప్ స్పందించిన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయ్యో ట్రంప్ అంత భయమెందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. విదేశీ అధినేతను అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానించడం చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. గతంలో 1962లో నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ.. బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ మెక్‌మిలన్‌ను విమానాశ్రయంలో స్వాగతించిన తరువాత ఈ తరహాలో మరో విదేశీ నేతను ఆహ్వానించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Games 2026 : చివరి నిమిషంలో జోడీ మార్పు.. ఆసియా క్రీడ‌ల్లో భారత్‌కు రెండో గోల్డ్ మెడ‌ల్‌.. ఈ సారి షూటింగ్‌లో..Star Directors : స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే దర్శకులకు న‌యా టెన్ష‌న్‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com