☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఫహాద్‌ ఫాజిల్ సినిమాకు బాలకృష్ణ వాయిస్‌!

మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. టాలెంటెడ్ డైరెక్టర్ శశాంక్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో పాటు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల […] The post ఫహాద్‌ ఫాజిల్ సినిమాకు బాలకృష్ణ వాయిస్‌! appeared first on Adya News Telugu.
ఫహాద్‌ ఫాజిల్ సినిమాకు బాలకృష్ణ వాయిస్‌!

మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. టాలెంటెడ్ డైరెక్టర్ శశాంక్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో పాటు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. నందమూరి అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం కావడం విశేషం. బాలయ్య వాయిస్ ఓవర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్‌లోని విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలాఉంటే, ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. రాజమౌళి సమర్పణలో వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఫహాద్ ఫాజిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The post ఫహాద్‌ ఫాజిల్ సినిమాకు బాలకృష్ణ వాయిస్‌! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← క్రికెట్.. ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్!జపాన్‌తో భారత్ టీ20 మ్యాచ్.. ఆందోళనలో ఫ్యాన్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com