☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు… ఈ మార్గాల్లో వెళ్లేవారికి..

దసరా, దీపావళికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే పలు రూట్లలో స్పెషల్ ట్రైన్లను ప్రకటించగా.. తాజాగా మరో రైలు షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. ఈ రైలులో ఇప్పటినుంచే అడ్వాన్స్ రిజర్వేషన్లు మొదలుపెట్టింది. ఈ రైలు టైమింగ్స్ చూద్దాం.
Indian Railways: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు… ఈ మార్గాల్లో వెళ్లేవారికి..
Indian Railway 1

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూ్స్ తెలిపింది. త్వరలో దసరా, దీపావళి పండగలు వస్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పటినుంచే అడ్వాన్స్ రిజర్వేషన్లను మొదలుపెడుతోంది. పండక్కి ఇంటికెళ్లే ప్రయాణికులతో రైళ్లల్లో ఎక్కువ రద్దీ ఏర్పడనుంది. సొంతూరుకెళ్లేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.

Indian Railway 2

పండక్కి ఇంటికెళ్లేందుకు టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను ప్రకటించడంతో పాటు వాటిల్లో రిజర్వేషన్లకు కూడా అవకాశం కల్పిస్తోంది. తాజాగా సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్ల టైమింగ్స్, స్టాపుల వివరాలను కూడా వెల్లడించారు. ఈ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Indian Railway 3

సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07039) ప్రత్యేక రైలు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతీ బుధవారం సికింద్రాబాద్‌లో 7.10 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో కాకినాడ-సికింద్రాబాద్(07040) రైలు కాకినాడలో గురువారం 21.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు సర్వీసులు అందించనుంది.

Indian Railway 4

ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకొట స్టేషన్లలో ఆగనుంది. ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుందని చెప్పవచ్చు. పండుగ సీజన్‌లో రద్దీని తగ్గించేందుకు ఈ రైలును తీసుకొచ్చారు.

Indian Railway 5

ఇక జల్నా-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. జల్నా-యలహంక(07601) రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. ఇది ప్రతీ ఆదివారం 19.20 గంటలకు జల్నాలో బయల్దేరి.. తర్వాతి రోజు 21.30 గంటలకు యలహంక చేరుకుంటుది. ఇక తిరుగు ప్రయాణంలో 07602 నెంబర్ రైలు యలహంకలో 23.30 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు 01.00 గంటలకు జల్నా చేరుకుంటుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దానం నాగేందర్ అనర్హత అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టుఇంట్లో కూరగాయలు లేనప్పుడు.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఈ రైస్ పెడితే వదలకుండా తింటారు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com