☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అత్తాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర.. ఈసారి ఎంత పలికిందంటే..

అత్తాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర.. ఈసారి ఎంత పలికిందంటే.. Caption of Image. హైదరాబాద్ అత్తాపూర్‌లో గణేష్ లడ్డూ వేలం హోరాహోరీగా సాగింది. పురాతన పోచమ్మ ఆలయం దగ్గర నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో.. 11 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డూను వేలం వేశారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు దాదాపు 50 మంది పోటీపడ్డారు. అత్తాపూర్ గణేష్ లడ్డూ గత ఏడాదితో పోల్చితే ఈసారి భారీ ధర పలికింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో గుమ్మడి బ్రదర్స్‌కు చెందిన భూపాల్ రెడ్డి 13 లక్షల 21 వేల రూపాయల రికార్డు ధరకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వేలం ధరతో పోలిస్తే ఈసారి రూ.70 వేల అధిక ధర పలికింది. దీంతో అత్తాపూర్‌లో ఇప్పటివరకు లడ్డూ ప్రసాదానికి పలికిన అత్యధిక
అత్తాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర.. ఈసారి ఎంత పలికిందంటే..
అత్తాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర.. ఈసారి ఎంత పలికిందంటే..

హైదరాబాద్ అత్తాపూర్‌లో గణేష్ లడ్డూ వేలం హోరాహోరీగా సాగింది. పురాతన పోచమ్మ ఆలయం దగ్గర నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో.. 11 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డూను వేలం వేశారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు దాదాపు 50 మంది పోటీపడ్డారు.

అత్తాపూర్ గణేష్ లడ్డూ గత ఏడాదితో పోల్చితే ఈసారి భారీ ధర పలికింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో గుమ్మడి బ్రదర్స్‌కు చెందిన భూపాల్ రెడ్డి 13 లక్షల 21 వేల రూపాయల రికార్డు ధరకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వేలం ధరతో పోలిస్తే ఈసారి రూ.70 వేల అధిక ధర పలికింది. దీంతో అత్తాపూర్‌లో ఇప్పటివరకు లడ్డూ ప్రసాదానికి పలికిన అత్యధిక ధరగా ఈ వేలం నిలిచింది.

నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ భజనలు, కీర్తనలు, హారతులు, గణపతి హోమం, అన్నదానం, ముగ్గుల పోటీలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. చిన్నారులు, యువతకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ రోజు గణేష్ నిమజ్జనం ఘనంగా శోభాయాత్ర నిర్వహించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← టాటా మోటార్స్ కొత్త కాంపాక్ట్ సెడాన్ 'ఏరిస్'.. రూ.5లక్షల 29వేల ప్రారంభ ధరతోజెన్ జీల ఓట్లను అడ్డుకున్నారు..ముమ్మాటికీ మోదీ, సీఈసీ కుట్ర: కాంగ్రెస్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com