☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!

Flash Flood Alerts: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు అధికారులు అప్రమత్తం చేశారు. కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున […]
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!

Flash Flood Alerts: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు అధికారులు అప్రమత్తం చేశారు.

కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం
తీవ్ర వాయుగుండం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వ్యవస్థ మరో 12 గంటల పాటు తీవ్ర వాయుగుండంగా కొనసాగనుంది. ఆ తర్వాతి 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటినప్పటికీ మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం
గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. సుమారు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశించారు.

ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతలపాడు ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు 74 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గ్రామం నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేక చీకటిలో ఉంది. మరోవైపు రెవెన్యూ శాఖ నిర్వహించిన ప్రాథమిక అంచనాల్లో 40 ఇళ్లు పాక్షికంగా, మరో 10 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

విజయనగరంలో నీటమునిగిన పంట పొలాలు
విజయనగరం జిల్లాలో గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని పత్తి పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. గజపతినగరం మండలం తమ్మిరాయుడుపేటలో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. అటు, అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి ప్రాంతంలో భారీ వర్షాలకు ధారకొండ మండలంలోని గంగవరం రహదారి కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి పరిస్థితిని అధికారులు పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

విశాఖలో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం
అతి భారీ వర్షాలు విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపాయి. 24 గంటల వ్యవధిలో నగరంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు రహదారులు దెబ్బతిన్నాయి. బీచ్ రోడ్‌ కొంతమేర కోతకు గురై, కొన్ని చోట్ల రహదారులు కుంగిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. కామత్ జంక్షన్ వద్ద ఓ కారు నీటిలో కూరుకుపోయింది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తరాంధ్రపై కేంద్రీకృతమై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్రత తగ్గి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 150+ స్పోర్ట్స్ మోడ్‌లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com