☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Andhra Pradesh : ఏపీలో ఆందోళనకర ఘటన.. గంటలోనే పెనువిధ్వంసం.. తెల్లవారుజామున కొండపైకి పరుగులు పెట్టిన ప్రజలు..

Andhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల గోరకల్లు గ్రామంలో పెనుముప్పు తప్పింది. ప్రజలు భయంతో కొండపైకి పరుగులు పెట్టారు.
Andhra Pradesh : ఏపీలో ఆందోళనకర ఘటన.. గంటలోనే పెనువిధ్వంసం.. తెల్లవారుజామున కొండపైకి పరుగులు పెట్టిన ప్రజలు..

Andhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల పరిధిలో పెనుముప్పు తప్పింది. గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్‌కు ఉన్న ఏకైక గేటును ఆకతాయి ఎత్తడంతో రిజర్వాయర్ నుంచి గోరుకల్లు గ్రామంలోకి భారీగా నీరు పోటెత్తింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు రిజర్వాయర్ కట్ట తెగిపోయిందని ప్రచారం చేయడంతో స్థానిక ప్రజలు భయంతో కొండపైకి పరుగులు తీశారు. గంటపాటు కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : AP Telangana Flash Flood Alert : ఏపీ, తెలంగాణకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ 13జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు..

గోరుకల్లు రిజర్వాయర్‌కు‌ఉన్న ఓ గేటును గుర్తుతెలియని ఆకతాయి మంగళవారం తెల్లవారుజామున ఎత్తాడు. ఆ సమయంలో రిజర్వాయర్ లో 9.5 టీఎంసీల నీరు ఉండగా.. ఎత్తిన గేటు నుంచి మూడువేల క్యూసెక్కులకుపైగా నీరు బయటకు ప్రవహించింది. భారీగా నీటి ప్రవాహం పోటెత్తడంతో ఎస్సార్బీసీ కాలువలోకి సామర్థ్యానికి మించి నీరు చేరింది. నీటి ప్రవాహాన్ని చూసిన కొందరు గ్రామస్తులు కట్ట తెగిపోయిందని భావించి.. గట్టిగా కేకలు వేసుకుంటూ భయంతో కొండపైకి పరుగులు తీశారు. నిద్రలో ఉన్నవారుసైతం లేచి కొండపైకి పరుగులు పెట్టారు. తెల్లవారుజాము కావడంతో కొందరు సెల్‌ఫోన్ల వెలుగులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కొండపైకి చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై.. రెగ్యులేటర్‌కు సమీపంలోనే ఓ సిమెంట్స్ పంపుహౌస్‌లో పనిచేసే కోటయ్య అనే ఎలక్ట్రీషియన్‌కు ఫోన్ చేసి ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ వద్ద ఓ గేటు నుంచి నీళ్లు పోతున్నాయని ఏం జరుగుతుందో చూడాలని సూచించారు. వెంటనే అతను వెళ్లి గేటు దించడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో పెను ముప్పు తప్పినట్లయింది. కొద్దిసేపటి తరువాత గ్రామస్తులు కొండపైనుంచి తమ ఇండ్లకు చేరుకున్నారు. ఇదిలాఉంటే.. గోరుకల్లు గేటు స్విచ్‌లు రెగ్యులేటర్‌ పైభాగంలో ఉన్నాయి. గేటు ఎత్తడం తెలిసినవాళ్లే ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డాడని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్‌ రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, అధికారులు గోరకల్లు వెళ్లారు. అక్కడ తెగిన కట్టలు, దెబ్బతిన్న పంట భూములను పరిశీలించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఆ గ్రామంలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని, ఎక్స్‌కవేటర్‌లు, డోజర్లను ఏర్పాటు చేశారు. 4.50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss Telugu 10 : తాజ్ మహల్ ముందు అమ్మతో ఫోటో దిగిన ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు బిగ్‌బాస్ లో అగ్రెసివ్ గా..AP Telangana Flash Flood Alert : ఏపీ, తెలంగాణకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ 13జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com