☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

RDS | ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం

కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. వరుణుడు కారుణించడంతో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది.
RDS | ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం

అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. వరుణుడు కరుణించడంతో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా ఎగువన వానలు అడపాదడపా కురిసినా ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరలేదు. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టులో పంటల సాగు చేపట్టలేదు. వరద వస్తుందన్న ఆశతో కొందరు రైతులు నారుమళ్లు పోసుకున్నా వరద రాకపోవడంతో ఎండిపోయాయి. ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. గత మూడు నెలలుగా తుంగభద్రకు వరద రాకపోవడంతో నదిలో నీటి జాడలు కరవయ్యాయి. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులతోపాటు నదీతీర ప్రాంతాల ప్రజలు నీటికి అష్టకష్టాలు పడుతున్నారు.

వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో 12,233 వచ్చి చేరుతుండగా, ఆర్డీఎస్ ఆనకట్ట 9.2 అడుగులకు చేరుకోగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆనకట్టపై నుంచి దిగువకు పారుతున్న వరద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మీదుగా సుంకేసుల బ్యారేజీకి పరుగులు పేడుతోంది. తుంగభద్ర నది, ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వెలుగు స్పెషల్ : అనుసంధాన భాషగా ఇంగ్లిష్ మంచిదేమో!Tollywood : టైర్-1 హీరో రేంజ్.. టాలీవుడ్‎లో ఇంకో వార్.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com