☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Garividi Lakshmi Review : గరివిడి లక్ష్మి రివ్యూ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రాగ్ మయూర్, నరేష్, విజయ్ కృష్ణ సహా మరికొంతమంది కీలక నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, తెలంగాణ నేపథ్యం ఉన్న చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రమోషనల్ కంటెంట్ సూపర్‌గా వర్కవుట్ కావడంతో పాటు, ఆనంది […]
Garividi Lakshmi Review : గరివిడి లక్ష్మి రివ్యూ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రాగ్ మయూర్, నరేష్, విజయ్ కృష్ణ సహా మరికొంతమంది కీలక నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, తెలంగాణ నేపథ్యం ఉన్న చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రమోషనల్ కంటెంట్ సూపర్‌గా వర్కవుట్ కావడంతో పాటు, ఆనంది స్టేజ్ మీద చేసిన డ్యాన్స్‌తో పాటు పాడిన పద్యాలు సినిమాకి మరింత మైలేజ్ తీసుకొచ్చాయి. మరి, ఈ రేంజ్‌లో ప్రేక్షకుల అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా, లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

గరివిడి లక్ష్మి కథ:
గరివిడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి (ఆనంది), చిన్ననాటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోక, చిన్న వయసులోనే పెళ్లైనా, భర్త మోసానికి బలై ఒంటరి మహిళగా మిగిలిపోతుంది. అయితే, అనుకోకుండా పరిచయమైన బుర్రకథ ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. అలా బుర్రకథలు చెబుతూ మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఏ తీరానికి చేరింది? మధ్యలో సత్యబాబు (రాగ్ మయూర్) పాత్ర ఏమిటి? అసలు విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ఎలా మారింది? ఈ ప్రయాణంలో రాంబాబు (నరేష్) పాత్ర ఏమిటి? ఆమె కథను సినిమాగా తీయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన డైరెక్టర్ (అంకిత్ కొయ్య), ఆ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడా, లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇప్పుడున్న కాలంలో బయోపిక్ అనగానే మనకు గుర్తుకొచ్చే మొదటి పేరు మహానటి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమా, ఇప్పుడు బయోపిక్స్ అన్నింటికీ ఒక దిక్సూచిలా మారిపోయింది. అయితే, పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేని గరివిడి అనే ఒక గ్రామానికి చెందిన గరివిడి లక్ష్మి అనే మహిళ జీవితం, ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే అనుమానం సినిమా చూడక ముందు వరకు ఉండేది. కానీ, సినిమా ప్రారంభమైన తర్వాత గరివిడి లక్ష్మి అనే పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేసేలా ఈ సినిమా దర్శకుడు కథ రాసుకున్నాడు.

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఒక యంగ్ డైరెక్టర్ సినిమా చేయడానికి బయలుదేరి, గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన ఘట్టాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్లడంతో మొదలవుతుంది. ఆమె బాల్యం, ఆ తర్వాత కౌమారదశ, వివాహం, ఆ వివాహం ఇబ్బందులతో చెదిరిపోవడం, ఆ తర్వాత అసలు ఆమెకు బుర్రకథ ఎలా పరిచయమైంది అంటూ ఒక్కొక్క ఘట్టాన్ని ఆసక్తికరంగా తెర మీదకు తీసుకువచ్చే విషయంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా గరివిడి లక్ష్మి పాత్ర పరిచయం, ఆమె ఎదుగుతున్న తీరు చూపించగా.. సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ కనెక్ట్‌తో రాసుకున్నాడు దర్శకుడు. ఆమెకు జరిగిన అవమానాలు, మోసాలు, వాటికి ఆమె ఎలాంటి పగ తీర్చుకోకుండా తనంతట తాను వెళ్లిపోయి ప్రత్యేకంగా జీవితం గడపడం వంటి అంశాలను ఆడియన్స్‌ను కదిలించేలా తెర మీదకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా కమర్షియాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలిగినా, ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన విషయంలో మాత్రం ఎక్కడా మిస్ కాలేదనే చెప్పాలి.

నిజానికి బయోపిక్ అంటే జీవితంలో జరిగిన అన్ని సంఘటనల సమాహారం అనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో కూడా ఆమె ఎత్తుపల్లాలను సమానంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న ఫీల్ అయితే కనిపించలేదు. ప్రేక్షకుడు గరివిడి లక్ష్మి అనే పాత్రను తమ సొంత మనిషిగా భావించేలా ఆమె పాత్రను డిజైన్ చేశారు. సావిత్రి లాంటి స్టార్ హీరోయిన్ బయోపిక్ చేశారంటే, అది కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది. కానీ, ఇలా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తప్ప మిగతా తెలుగు ప్రజలకు కూడా పెద్దగా పరిచయం లేని ఒక మహిళ జీవితాన్ని తెర మీదకు తీసుకురావాలనుకునే ప్రయత్నంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఒక మట్టి కథను అన్ని సెంటర్ల ఆడియన్స్‌ను మెప్పించేలా మంచి ఫీల్‌తో తీసుకురావడం చాలా కష్టం. కానీ, ఆ విషయంలో కృతి ప్రసాద్ కష్టపడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, సినిమాలో ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించే సన్నివేశాలు కానీ, అశ్లీలత కానీ లేవు. ఒక మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలను ఎంత హృద్యంగా చూపించాలో, అంత హృద్యంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చివరి అరగంట అయితే ఎమోషనల్ అయ్యేలా చేసి కన్నీళ్ళు పెట్టించేలా చేశాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో గరివిడి లక్ష్మి అనే పాత్రలో ఆనంది పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్లుగా నటించింది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ పాత్రలో ఆనందిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అన్నంతగా ఆమె ఒదిగిపోయిన తీరు అభినందనీయం. ఇక రాగ్ మయూర్‌కు మరో మంచి పాత్ర పడింది. నటించే స్కోప్ ఉన్న పాత్రలో రాగ్ మయూర్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నరేష్ కీలక పాత్రలో నటించడమే కాదు, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రాశి పాత్ర కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు, ఆమె అంతే చక్కగా నటించారు. శరణ్య ప్రదీప్ సహా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించిన వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకోవడమే కాదు, ఆ కథను అంతే ఆసక్తికరంగా తెర మీదకు తీసుకురావడంలో తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్లే అనిపించింది.

డైలాగ్స్ విషయంలో విజయనగరం యాస కొన్ని ప్రాంతాల వారికి అర్థం కాకపోయినట్లు అనిపించినా, చాలా వరకు ఈజీగా అర్థమయ్యే డైలాగ్స్‌తోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. కథ నేపథ్యం అంతా విజయనగరం కాబట్టి, కొంతవరకు ఆ నేటివిటీ ఉండేలా చూసుకున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ను క్యారీ చేయడంలో ఉపయోగపడింది. నిడివి కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యింది. ఇక పాటల విషయానికి వస్తే చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమాకి అసెట్. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్లీ.. గరివిడి లక్ష్మి, ఎంగేజింగ్ బయోపిక్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com