☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Adani Arogya Mandir: 2000 బెడ్స్‌తో అదానీ ఆస్ప‌త్రి.. కోల్‌క‌తాలో శంకుస్థాప‌న‌

Gautam Adani: 2000 ప‌డ‌క‌లతో అదానీ ఆరోగ్య మందిర్‌ను నిర్మించ‌నున్నారు. దీని కోసం ఇవాళ శంకుస్థాప‌న చేశారు. అదానీ గ్రూపు చైర్మెన్ గౌత‌మ్ అదానీ, బెంగాల్ సీఎం సువేంధు అధికారి ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
Adani Arogya Mandir: 2000 బెడ్స్‌తో అదానీ ఆస్ప‌త్రి.. కోల్‌క‌తాలో శంకుస్థాప‌న‌

కోల్‌క‌తా: కోల్‌క‌తా స‌మీపంలోని న్యూ టౌన్ ఏరియాలో సుమారు 2000 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణం కోసం ఇవాళ శంకుస్థాప‌న చేశారు. అదానీ గ్రూపు చైర్మెన్ గౌత‌మ్ అదానీ, బెంగాల్ సీఎం సువేంధు అధికారి ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అదానీ ఆరోగ్య మందిర్ భూమి పూజ కార్య‌క్ర‌మంలో అదానీ భార్య‌, అదానీ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప్ర‌తీ అదానీ, కుమారుడు క‌ర‌ణ్ అదానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. అదానీ ఆరోగ్య మందిర్‌కు సీఎం అధికారి భూమిపూజ చేశారు. న్యూ టౌన్‌లో ఉన్న యాక్ష‌న్ ఏరియాలోని 51 ఎక‌రాల్లో ఆరోగ్య మందిర్‌ను నిర్మించ‌నున్నారు.

ఆస్ప‌త్రిలో స‌గం బెడ్స్‌ను పేద పేషెంట్ల‌కు కేటాయించ‌నున్న‌ట్లు సీఎం అధికారి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు గౌతం అదానీ న‌గ‌రంలోని కాళీఘాట్ ఆల‌యంలో పూజ‌లు చేశారు. బెంగాల్‌లో ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు అదానీ తెలిపారు. 2035 నాటి క‌ల్లా ఆ పెట్టుబ‌డులు సాగ‌నున్న‌ట్లు చెప్పారు. పోర్టులు, లాజిస్టిక్స్‌, ప‌వ‌ర్‌, రోడ్డులు, డేటా సెంట‌ర్ల‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంద‌ని గౌత‌మ్ అదానీ తెలిపారు. మ‌ల్టీ స్పెషాల్టీ ఆరోగ్య మందిర్ నిర్మాణం కోసం సుమారు 4వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. సుమారు 10వేల మందికి ఉద్యోగ ఉపాధి ఇవ్వ‌నున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Traffic Fine | తొమ్మిది మంది మరణానికి కారణమైన బస్సుకు లక్షన్నరకు పైగా ఫైన్‌Udta Teer | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియాకు వస్తే.. హిలేరియస్‌గా ‘ఉడ్తా తీర్’ ట్రైలర్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com