☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్‌ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ ఇంట తీవ్ర విషాదం..

MA Ghaffoor’s Son Kiran Dies in US: సీపీఎం సీనియర్‌ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంఏ గఫూర్‌, ఐద్వా నేత నిర్మల కుమారుడు కిరణ్(41) అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివసిస్తున్న కిరణ్ అక్టోబర్ 1న మరణించినట్లు తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. గత పది రోజులుగా కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అమెరికాలోని తెలుగు […]
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్‌ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ ఇంట తీవ్ర విషాదం..

MA Ghaffoor’s Son Kiran Dies in US: సీపీఎం సీనియర్‌ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంఏ గఫూర్‌, ఐద్వా నేత నిర్మల కుమారుడు కిరణ్(41) అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివసిస్తున్న కిరణ్ అక్టోబర్ 1న మరణించినట్లు తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. గత పది రోజులుగా కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులను సంప్రదించారు.

ఉన్నత విద్య అభ్యసించి.. అమెరికాలో ఉద్యోగం
కిరణ్ విద్యాపరంగా మంచి ప్రతిభ కనబరిచారు. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్)లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ప్రముఖ సంస్థ పేపాల్‌లో సీనియర్ డేటా సైంటిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివాసం ఉంటున్న కిరణ్ మృతి వార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.

పది రోజులుగా సమాచారం లేకపోవడంతో ఆందోళన
గత పది రోజులుగా కిరణ్ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆయన గఫూర్‌, నిర్మల దంపతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అమెరికాలోని అమనా (AMANA), తానా (TANA) ప్రతినిధులను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి వివరాలు సేకరించడంతో అక్టోబర్ 1వ తేదీనే కిరణ్ మరణించినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తల్లిదండ్రులకు తెలియజేశారు.

కిరణ్ భౌతికకాయాన్ని కర్నూలుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
కిరణ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి కర్నూలుకు తీసుకురావడానికి అమనా, తానా ప్రతినిధులు సహకరిస్తున్నారు. అయితే, అమెరికాలో వరుసగా మూడు రోజుల సెలవులు ఉండటంతో అవసరమైన ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ భౌతికకాయం కర్నూలుకు చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి, విదేశాల్లో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న కిరణ్ మరణవార్త అతని కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com