Balapur Ganesh Shobhayatra:హైదరాబాద్ నగరంలో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడానికి అలాగే శోభాయాత్రను ప్రత్యక్షంగా చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం మరియు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read also: TG-TMARS: తెలంగాణలో ట్రాఫిక్‌పై కొత్త నిఘా

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు పూర్తి
హుస్సేన్ సాగర్ తీరంతో పాటు నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాలలో అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వినాయక విగ్రహాలను త్వరితగతిన గంగమ్మ ఒడికి చేర్చే విధంగా భారీ క్రెయిన్లను సిద్ధం చేశారు. భక్తుల రద్దడిని నియంత్రించడానికి ప్రత్యేక రోప్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
Balapur Ganesh Shobhayatra:కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతున్న యాత్ర
భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్లను ఉపయోగిస్తూ ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా అన్ని శాఖల సమన్వయంతో బల్దియా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:






