☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

అంతరిక్షంలోకి ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్ ప్రయోగం!

టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఏకంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ సన్‌ క్యాచర్‌’ కింద సరికొత్త ప్రయోగం జరగనుంది. అత్యధిక ఇంధన సమర్థత, విశేష పనితనం కలిగిన లేటెస్ట్ ఏఐ యాక్సిలరేటర్ చిప్‌ను త్వరలో పరీక్షించనున్నారు. అదే గూగుల్ రూపొందించిన ట్రిల్లియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ (TPU). అంతరిక్షంలో ఉండే తీవ్రమైన రేడియోధార్మికత, విపరీతమైన వేడి, కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొని […] The post అంతరిక్షంలోకి ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్ ప్రయోగం! appeared first on Adya News Telugu.
అంతరిక్షంలోకి ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్ ప్రయోగం!

టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఏకంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ సన్‌ క్యాచర్‌’ కింద సరికొత్త ప్రయోగం జరగనుంది. అత్యధిక ఇంధన సమర్థత, విశేష పనితనం కలిగిన లేటెస్ట్ ఏఐ యాక్సిలరేటర్ చిప్‌ను త్వరలో పరీక్షించనున్నారు. అదే గూగుల్ రూపొందించిన ట్రిల్లియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ (TPU).

అంతరిక్షంలో ఉండే తీవ్రమైన రేడియోధార్మికత, విపరీతమైన వేడి, కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొని ఏఐ చిప్‌లు మనుగడ సాగించగలవా లేదా అని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. సౌర విద్యుత్ ఆధారంగా పనిచేసే కృత్రిమ మేధ కంప్యూటింగ్‌ సదుపాయాలను అంతరిక్షంలో విజయవంతంగా పరీక్షించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఖగోళంలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి, సౌరశక్తితో నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ డేటాను ప్రాసెస్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

భూమిపై ఏఐ డేటా సెంటర్ల నిర్వహణకు ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. భారీగా విద్యుత్ అవసరమవడం, తగిన భూమి దొరకకపోవడం, డేటా సెంటర్లను చల్లబరిచే కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం పెను భారంగా మారింది. ఈ సమస్యలన్నింటికీ అంతరిక్ష ప్రయోగంతో చెక్ పెట్టవచ్చని గూగుల్ అంచనా వేస్తోంది. అంతరిక్షంలో సౌర విద్యుత్ పుష్కలంగా లభిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

భూమి ఉపరితలం నుంచి తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో నిరంతరం సౌరశక్తిని పొందడానికి అవకాశం ఉంది. భూమిపై ఉత్పత్తి చేసే దానికన్నా సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ పరిమాణంలో అక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని గూగుల్ స్పష్టం చేసింది. ఈ అనంతమైన సౌరశక్తిని ఏఐ కంప్యూటింగ్ అవసరాల కోసం పూర్తిగా వాడుకోవాలని గూగుల్ వ్యూహరచన చేస్తోంది. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే భవిష్యత్తులో కృత్రిమ మేధ రంగంలో ఇదొక అద్భుతమైన విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

The post అంతరిక్షంలోకి ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్ ప్రయోగం! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG
← యూపీ ఎన్నికలు కష్టమేనా..? ఏం జరుగుతోంది..?జాసన్‌ సంజయ్‌పై చిరంజీవి ప్రశంసలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com