జయశంకర్ భూపాలపల్లి : కేసీఆర్ ( KCR ) ఆలోచనల నుంచి పురుడు పూసుకున్న చిన్న జిల్లాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు పాలన చేరువైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ( Gandra Venkataramana Reddy ) అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆవిర్భవించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుంచి మెడికల్ కళాశాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, అన్ని జిల్లా శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రంలో ఏర్పడడం వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.






