☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మ్యాగీ ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మ్యాగీ ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టానికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక పదార్థం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబం చివరిగా టీ తాగి, మ్యాగీ తిన్నట్లు సమాచారం. ఆ తర్వాత కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే అసలు మరణ కారణం వెల్లడి అవుతుంది. పోలీసులు ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఐదుగురి మరణాలు విషాహారం వల్లే సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏదో తిన్న తర్వాతే ఈ మరణాలు సంభవించాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. చివరిగా టీ, మ్యాగీని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పదార్థాలే మరణాలకు కారణమయ్యాయా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనేది పోస్ట్‌మార్టం నివేదిక విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com