☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

డిప్రెషన్.. దేశంలో అత్యధికంగా గుజరాత్లో మెంటల్ కేసులు నమోదు

డిప్రెషన్.. దేశంలో అత్యధికంగా గుజరాత్లో మెంటల్ కేసులు నమోదు Caption of Image. గుజరాత్‌లో మానసిక ఆరోగ్యం సరిలేక హాస్పిటల్స్లో చేరుతున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025-26లో 15.43 లక్షల మెంటల్ హెల్త్ కేసులు గుజరాత్లో నమోదు కావడం విస్మయానికి గురిచేసింది. మన దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో మెంటల్ హెల్త్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. గుజరాత్ రాష్ట్రంలో డిప్రెషన్ కేసులు 3 లక్షలు దాటడం ఆందోళన కలిగించే విషయం. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారి సంఖ్య గుజరాత్లో 2 లక్షల 65 వేల 487కి పెరిగింది. అక్టోబర్ 10న మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను గుజరాత్ మీడియా రిపోర్ట్ చేసింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో డిప్రెషన్ కేసులు 2018-19లో 2,14,546 నుంచి 2025-
డిప్రెషన్.. దేశంలో అత్యధికంగా గుజరాత్లో మెంటల్ కేసులు నమోదు
డిప్రెషన్.. దేశంలో అత్యధికంగా గుజరాత్లో మెంటల్ కేసులు నమోదు

గుజరాత్‌లో మానసిక ఆరోగ్యం సరిలేక హాస్పిటల్స్లో చేరుతున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025-26లో 15.43 లక్షల మెంటల్ హెల్త్ కేసులు గుజరాత్లో నమోదు కావడం విస్మయానికి గురిచేసింది. మన దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో మెంటల్ హెల్త్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. గుజరాత్ రాష్ట్రంలో డిప్రెషన్ కేసులు 3 లక్షలు దాటడం ఆందోళన కలిగించే విషయం. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారి సంఖ్య గుజరాత్లో 2 లక్షల 65 వేల 487కి పెరిగింది. అక్టోబర్ 10న మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను గుజరాత్ మీడియా రిపోర్ట్ చేసింది.

గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో డిప్రెషన్ కేసులు 2018-19లో 2,14,546 నుంచి 2025-26 నాటికి 3,06,477కి పెరిగాయి. ఇదే కాలంలో, ఆందోళన, మానసిక ఒత్తిడి కేసులు 2,04,361 నుంచి 2,65,487కి పెరిగాయి. స్కిజోఫ్రీనియా కేసులు కూడా 2018-19లో 1,63,206 నుండి 2025-26 నాటికి 2,16,182కి పెరిగాయి. మానసిక స్థితి సంబంధిత రుగ్మతలు 1,27,058 నుంచి 1,73,007కి పెరగగా, మెదడు సంబంధిత పరిస్థితులుగా వర్గీకరించబడిన కేసులు 1,31,643 నుండి 1,95,755కి పెరిగాయి.

బాల్యంలో రుగ్మతల బారిన పడి ఇబ్బంది పడిన వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ సంఖ్య 2018-19లో 56,298 నుంచి 2025-26 నాటికి 91,916కు పెరిగింది. అంటే సుమారు 63% పెరుగుదల. పిల్లలలోని భావోద్వేగ, ప్రవర్తనాపరమైన ఇబ్బందులను ఆరంభ దశలోనే గుర్తించడం ముఖ్యమని.. లేకపోతే మానసిక సమస్యలకు దారితీస్తుందని ఈ డేటా చెప్పకనే చెబుతోంది. వృద్ధులలో మానసిక ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించే మరో అంశం.

తాజా గణాంకాల ప్రకారం.. గత ఆరు సంవత్సరాలలో వయోవృద్ధులలో ఈ కేసులు సుమారు 50,000 నుంచి దాదాపు 85,000కు పెరిగాయి. ఒంటరితనం, పదవీ విరమణ, శారీరక బలహీనత, తగ్గిన సామాజిక సంబంధాలు వృద్ధుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ సభ్యులు వృద్ధులను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ సంతోషంగా ఉంచితే వృద్ధాప్యంలో మానసిక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పనామా తీరంలో భూకంపం... సునామీ హెచ్చరికలు..ట్రంప్ గ్రీన్ కార్డ్ రూల్స్‌తో కొత్త జాబ్స్ ట్రెండ్.. స్వదేశంలోనే టెక్కీలకు అవకాశాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com