☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. 120 వార్డులకు 1,623 నామినేషన్లు జీవీఎంసీ పరిధిలోని 120 […]
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.

120 వార్డులకు 1,623 నామినేషన్లు
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు మొత్తం 1,623 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున 493, జనసేన పార్టీ తరఫున 266, భారతీయ జనతా పార్టీ తరఫున 90 నామినేషన్లు నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 359 నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 287 నామినేషన్లు వచ్చాయి. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆశించిన స్థానాలు దక్కని నాయకులు, ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలు అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కూటమి పార్టీలు అభ్యర్థుల జాబితాలను అధికారికంగా ప్రకటించకుండానే కొందరికి నేరుగా బీ ఫారాలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది.

మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది ఉన్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో సీట్ల పంపకం పూర్తవడంతో పాటు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు, మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎవరికి ఉంటుందన్న అంశాలపై విశాఖ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్‌కు అవమానం.. ఆప్ ఆగ్రహంPolice Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com