Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. 18వ రోజు ఎపిసోడ్‌లో హౌస్ గేట్ వద్ద అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ ప్రత్యక్షమై ఇంటి సభ్యులను ఆశ్చర్యపరిచారు. ఈ ముగ్గురిలో ఎవరిని ఇంట్లోకి తీసుకోవాలో నిర్ణయించే బాధ్యతను బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లకే అప్పగించారు.
దీంతో ఈ కొత్త ముగ్గురూ తమ గేమ్ ప్లాన్‌ను వివరించే ప్రయత్నం చేశారు. ఇంట్లోని ‘మాస్టర్స్, పప్పెట్స్’ ఎవరు, ‘గుంట నక్కల’ ఆటలేంటో బయటపెట్టి గ్రూపులను బ్రేక్ చేస్తానని మిథిలేష్ ప్రకటించగా, కంటెస్టెంట్లు తమ అసలు పర్సనాలిటీ కోల్పోతున్నారని అపూర్వ వ్యాఖ్యానించింది. రామకృష్ణ మాత్రం చాలా జెన్యూన్‌గా ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పాడు.
Read Also : Big Boss Telugu10: హౌస్‌లో 3వ వారం నామినేషన్స్.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

Bigg Boss 10 Telugu: మంటలు రేపిన మిథిలేష్ కామెంట్లు..
వైల్డ్ కార్డ్ ఎంట్రీల వ్యాఖ్యలు ఇంట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తనను ‘కన్నింగ్’ అని ఎందుకు అన్నావంటూ రాం ప్రసాద్, మిథిలేష్‌ను నిలదీశాడు. అమన్‌ను కావాలనే బయటకు పంపిన విధానం నచ్చలేదని మిథిలేష్ స్పష్టం చేశాడు. మరోవైపు త్రిగుణ్ కూడా మిథిలేష్‌ను ప్రశ్నించాడు. రోహిత్‌ను ‘స్టెరాయిడ్స్’తో పోల్చడం, ముఖేష్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ఈ చర్చ కాస్తా స్వచ్ఛమైన తెలుగు భాషపై వాదనకు దారితీసింది. పద్యాలు చెప్పగలవా అంటూ త్రిగుణ్ ప్రశ్నించగా, పద్యాలు చెప్తేనే తెలుగు వచ్చినట్టు కాదని మిథిలేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
ముఖేష్ ఓటింగ్‌పై అపూర్వ కౌంటర్.. హౌస్‌లో ముదిరిన ఉత్కంఠ
ఇక ముఖేష్ తనను తాను స్టార్ ప్లేయర్‌గా చెప్పుకునే ప్రయత్నం చేయగా, అపూర్వ తీవ్రంగా స్పందించింది. ముఖేష్‌కి వచ్చింది చాలా తక్కువ ఓట్లని, అవి కూడా సొంత కూటమి నుంచే వచ్చాయని నేరుగా ఎండగట్టింది. దీనికి సమాధానంగా మిథిలేష్ బయటకు వెళ్లి జిమ్ ట్రైనర్‌గా ఉండటమే మంచిదని ముఖేష్ కామెంట్ చేయగా, రోహిత్ ఆ మాటలను తప్పుబట్టాడు. ముఖేష్, సుధీర్, వర్షిణి మాత్రం రామకృష్ణ జెన్యూన్‌గా ఉన్నాడని, అతను హౌస్‌లోకి వస్తే బాగుంటుందని భావించారు. ఈ క్రమంలో బయట పడిన కామెంట్లు రాబోయే ఎపిసోడ్లలో ఎలాంటి ఘర్షణలకు దారితీస్తాయో వేచి చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


