☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గుండె నుంచి మెదడు వరకు ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు.. రోజుకొకటి తింటే చాలు

ఈ ఆరోగ్యకరమైన లడ్డూలను పంచదార బదులుగా తీసుకోవచ్చు. ఇవి రుచికరమైనవే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి బలాన్ని అందిస్తాయి. ఈ అలవాటు కొన్నిసార్లు వ్యసనంగా మారి, తీపి లేనిదే భోజనం పూర్తి కాని భావనను కలిగిస్తుంది. అయితే, పంచదారతో ఇంకా నూనెలో వేయించిన స్వీట్లు తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అని అంటున్నారు.
గుండె నుంచి మెదడు వరకు ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు.. రోజుకొకటి తింటే చాలు
Avise Ginjala Laddu

గుండె ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు: కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ అయినవారు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవారు అవిసె గింజల లడ్డును తీసుకోవడం మంచిది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని దోరగా వేపించి, ఖర్జూరం, యాలకుల పొడి కలిపి, తేనె లేదా చెరుకు పానకంతో లడ్డులా చేసుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తీపిని తగ్గించి తీసుకోవచ్చు.

A Pucha Ginjala Ladu

ప్రోటీన్ లోపానికి పుచ్చ గింజల లడ్డు: ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకు, ప్రోటీన్ లోపం ఉన్నవారికి పుచ్చ గింజల పప్పు లడ్డు మంచిది. ఈ పుచ్చ గింజల పప్పులో 34% వరకు ప్రోటీన్ ఉంటుంది. వీటిని దోరగా వేపించి, ఖర్జూరం, తేనె, చెరుకు పానకం, బెల్లంతో లడ్డు చేసుకోవచ్చు.

A Nuvula Laddu

కాల్షియం లోపానికి నువ్వుల లడ్డు:పిల్లలు, పెద్దలు ఎవరికైనా కాల్షియం లోపం, ఎముకలు గుల్లబారడం, మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం ఉన్నవారు నువ్వుల లడ్డును తప్పనిసరిగా తీసుకోవాలి. తెల్ల నువ్వులను దోరగా వేపించి, ముక్కా చెక్కలా చేసి, ఖర్జూరం పొడి, తేనె లేదా బెల్లం పొడి కలిపి లడ్డు చేసుకోవాలి. నువ్వులలోని సహజ నూనెలతోనే లడ్డు చక్కగా తయారవుతుంది.

A Sun Flower Seeds

యవ్వనంగా కనిపించడానికి ప్రొద్దు తిరుగుడు పప్పు లడ్డు:ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలనుకునే వారికి, విటమిన్ ఇ అవసరమైన వారికి ప్రొద్దు తిరుగుడు పప్పు లడ్డు బెస్ట్. ప్రొద్దు తిరుగుడు పప్పును వేపించి, ఖర్జూరం, తేనె లేదా చిక్కటి చెరుకు పానకంతో లడ్డు చేసుకోవచ్చు. ఇది విటమిన్ ఇ సప్లిమెంట్లకు మంచి ఎంపిక ఎంపిక.

Badam Laddu

మెదడు ఆరోగ్యానికి వాల్‌నట్స్, బాదం లడ్డు: మతిమరుపు, మెదడు బలహీనత వంటి సమస్యలు ఉన్న పెద్దలకు వాల్‌నట్స్, బాదం పప్పుల లడ్డు మంచిది. వీటిని వేయించి లడ్డులా చేసుకుంటే మెదడు కణాల డిటాక్సిఫికేషన్, నరాల కణాల పోషణకు అవసరమైన ఒమేగా ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దశాబ్దంలో తొలిసారి తగ్గిన వరి ఉత్పత్తి … బియ్యం ధరలపై పెను ప్రభావం?వాతావరణ శాఖ ఇచ్చే రంగుల అలెర్ట్స్ ఎందుకు.. ఏ కలర్ దేనికి సంకేతం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com