☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

Schools Holiday: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నలం సమీపంలో తీరం దాటింది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు తీవ్ర వాయుగుండం […]
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

Schools Holiday: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నలం సమీపంలో తీరం దాటింది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

ఎన్‌టీఆర్ జిల్లాలోనూ విద్యాసంస్థలకు సెలవు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీఆర్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 24న ఒక రోజు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు రాకపోకలు సాగించే సమయంలో అసౌకర్యం లేదా ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

విజయనగరంలో పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెప్టెంబర్ 24న సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ కె.వి. బాలమణి తెలిపారు. విద్యార్థులు, చిన్నారులు వర్షాల సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

విశాఖలో వర్షాల ప్రభావం.. 41 చోట్ల చెట్ల తొలగింపు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖ నగరంలోనూ భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. నగరంలోని 41 ప్రాంతాల్లో కూలిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. యూజీడీ ఓవర్‌ఫ్లో, నీరు నిలిచిపోవడం వంటి ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 56 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కూలిపోయే ప్రమాదమున్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, పాత భవనాలు, గోడలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వర్షపు నీరు ప్రవహించే కాలువలు, గెడ్డలు, లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.

విశాఖ మధురవాడ కొమ్మాది ప్రాంతంలోని రికాన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. సెల్లార్ మొత్తం నీటితో నిండిపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సహాయక బృందాలు అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న సుమారు 70 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అనంతరం వారందరికీ సమీపంలోని మరో అపార్ట్‌మెంట్‌లో సురక్షితంగా ఆశ్రయం కల్పించారు.

శ్రీకాకుళంలో పంటలకు నష్టం
తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పోలాకి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. అరటి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com