☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

High Court | శుక్రవారం హైకోర్టుకు సెలవు.. వైన్స్‌లు బంద్‌

High Court | సెప్టెంబర్ 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్‌ మహా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సెలవు ఇచ్చారు. అదేవిధంగా వైన్‌ షాపులు మూతపడనున్నాయి.
High Court | శుక్రవారం హైకోర్టుకు సెలవు.. వైన్స్‌లు బంద్‌

High Court | హైదరాబాద్‌: గణేశ్‌ (Ganesh) నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. వినాయక చవితి నుంచి మూడో రోజు, ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు చాలా విగ్రహాలను నిమజ్జనం చేశారు. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ మహా నిమజ్జనోత్సవం (అనంత చతుర్దశి) ఈ నెల 25 శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టుకు సెలవు ఉంటుందని హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ సెలవుకు బదులుగా డిసెంబర్ 5 శనివారం కోర్టుకు వర్కింగ్ డే ఉంటుందని వెల్లడించారు.

High Court

High Court

వైన్స్‌లు బంద్‌
సైబరాబాద్‌ (Cyberabad) పరిధిలో నిమజ్జనోత్సవం రోజు 24 గంటలు మద్యం అమ్మకాలను బంద్ చేయనున్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను 24 గంటల పాటు మూసివేయనున్నారు. నగరంలోని స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968లోని సెక్షన్ 20 కింద ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్‌ అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలోని కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో గణేశ్‌ నిమజ్జనం ప్రారంభమయ్యే సెప్టెంబర్‌ 23 బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు వైన్‌ (Wine) షాపులు బంద్‌ చేయనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Donald Trump | AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్‌.. ఇక నుంచి ఆ పేరుతోనే పిలువాలంట‌..!Varanasi | మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి.. ఇక చివరి దశ పనులు జ‌రుపుకుంటున్న రాజ‌మౌళి చిత్రం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com