☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

20 ఏళ్ల కిందకు పడిపోయిన డైమండ్స్ ధరలు.. లాబ్-గ్రోన్ డైమండ్స్ హవానే అసలు కారణం!

20 ఏళ్ల కిందకు పడిపోయిన డైమండ్స్ ధరలు.. లాబ్-గ్రోన్ డైమండ్స్ హవానే అసలు కారణం!
20 ఏళ్ల కిందకు పడిపోయిన డైమండ్స్ ధరలు.. లాబ్-గ్రోన్ డైమండ్స్ హవానే అసలు కారణం!
20 ఏళ్ల కిందకు పడిపోయిన డైమండ్స్ ధరలు.. లాబ్-గ్రోన్ డైమండ్స్ హవానే అసలు కారణం!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డైమండ్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సహజ వజ్రాల ధరలు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా హోల్‌సేల్ ధరలు 2021 నాటి గరిష్ట స్థాయిలతో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకు తగ్గాయి. మార్కెట్లో డిమాండ్ మందగించడం, అధిక సరఫరా ఉండటంతో పాటు లాబ్-గ్రోన్ డైమండ్ల నుంచి పోటీ ఎదురుకావడమే ఈ రేట్ల పతనానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం ఒక క్యారెట్ నేచురల్ రౌండ్ డైమండ్ రిటైల్ ధర 3వేల530 డాలర్ల నుంచి 3వేల 860 డాలర్ల మధ్య ట్రేడవుతోంది.

నేచురల్ వజ్రాలతో రసాయనికంగా పూర్తిగా సమానంగా ఉండే ఈ లాబ్-గ్రోన్ డైమండ్స్.. సహజ వజ్రాల కంటే సుమారు 70 నుంచి 85 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. 2022 నాటితో పోలిస్తే సింథటిక్ వజ్రాల హోల్‌సేల్ ధరలు ఏకంగా 75 శాతానికి పైగా పడిపోయాయి. కేవలం మార్చి 2025 నుంచి చూస్తే లాబ్-గ్రోన్ డైమండ్ల ధరలు దాదాపు 29.9 శాతం క్షీణించగా, అదే నాణ్యత గల సహజ వజ్రాల ధరలు సుమారు 4 శాతం వరకు తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా లాబ్-గ్రోన్ డైమండ్ల ఉత్పత్తిలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మొత్తం ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఉత్పత్తిలో చైనా వాటా 60 శాతానికి పైగా ఉంది. ఈ ఏడాది మెుదటి 6 నెలల్లో చైనా నుంచి లాబ్-గ్రోన్ వజ్రాల ఎగుమతులు 65.3 శాతం మేర పెరగడంతో మార్కెట్‌పై మరింత భారం పడింది. ఈ తక్కువ ధరల రాక కారణంగా మధ్యస్థాయి సహజ వజ్రాల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అరుదైన, అత్యుత్తమ నాణ్యత కలిగిన పెద్ద సహజ వజ్రాలు మాత్రం తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మార్కెట్లో కొంతవరకు స్థిరత్వాన్ని కాపాడుకుంటున్నాయి.

ఈ రేట్ల పతనం వజ్రాల మైనింగ్ రంగాన్ని కూడా తీవ్రంగా కుదిపేస్తోంది. డిబియర్స్, బోట్స్వానా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 'డెబ్‌స్వానా' సంస్థ అమ్మకాల్లో భారీ క్షీణతను చవిచూసింది. సాంకేతిక పురోగతి కారణంగా ల్యాబ్ గ్రోన్ వజ్రాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తుండటంతో వజ్రాల సహజ అరుదైన విలువ ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే బిట్‌కాయిన్ లా కాకుండా వజ్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని.. వాటి కట్, కలర్, క్లారిటీ ఆధారంగా విలువ మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఉత్పత్తి మరింత పెరిగితే ఇది యావత్ డైమండ్ ఇండస్ట్రీని ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో అనే భయాలు ఈ రంగాన్ని వెంటాడుతున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG
← PGIMERలో నర్స్ ఉద్యోగాలు.. అనుభవం ఉంటే చాలు.. జాబ్ కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్!బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను తొక్కేసిన సౌత్ భామలు.. నేషనల్ లెవెల్ 'నెంబర్ 1' గా సామ్ రికార్డు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com