☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

మీకు నచ్చిన యాప్‌ను మీరే తయారు చేసుకోండి.. ఏఐతో గూగుల్ కొత్త ప్రయోగం!

మీకు నచ్చిన యాప్‌ను మీరే తయారు చేసుకోండి.. ఏఐతో గూగుల్ కొత్త ప్రయోగం! Caption of Image. ఇకపై సొంత అవసరాల కోసం మొబైల్ యాప్‌ తయారు చేసుకోవాలంటే పెద్దగా కోడింగ్‌ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో మనకు కావాల్సిన యాప్‌లను తయారు చేసుకుని, వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయకుండానే మన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగించుకునే ఫెసిలిటీని గూగుల్ తీసుకొస్తోంది. ఇంటి పనులను చూసుకోవడం, రోజు ఉండే ఖర్చులను లెక్కించడం, పర్సనల్ పనులను గుర్తుంచుకోవడం, మన టెస్టుకు అనుగుణంగా ప్రత్యేకమైన యాప్‌లను రూపొందించుకోవడం వంటి అవసరాలకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. సాధారణంగా ఒక యాప్‌ను తయారు చేసి ఇతరులు ఉపయోగించేలా అందుబాటులోకి తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్
మీకు నచ్చిన యాప్‌ను మీరే తయారు చేసుకోండి.. ఏఐతో గూగుల్ కొత్త ప్రయోగం!
మీకు నచ్చిన యాప్‌ను మీరే తయారు చేసుకోండి.. ఏఐతో గూగుల్ కొత్త ప్రయోగం!

ఇకపై సొంత అవసరాల కోసం మొబైల్ యాప్‌ తయారు చేసుకోవాలంటే పెద్దగా కోడింగ్‌ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో మనకు కావాల్సిన యాప్‌లను తయారు చేసుకుని, వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయకుండానే మన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగించుకునే ఫెసిలిటీని గూగుల్ తీసుకొస్తోంది.

ఇంటి పనులను చూసుకోవడం, రోజు ఉండే ఖర్చులను లెక్కించడం, పర్సనల్ పనులను గుర్తుంచుకోవడం, మన టెస్టుకు అనుగుణంగా ప్రత్యేకమైన యాప్‌లను రూపొందించుకోవడం వంటి అవసరాలకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. సాధారణంగా ఒక యాప్‌ను తయారు చేసి ఇతరులు ఉపయోగించేలా అందుబాటులోకి తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత అవసరాల కోసం యాప్‌లు తయారు చేసుకునే వారికి ఆ ఇబ్బందులను తగ్గించడమే గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, ఈ ఫెసిలిటీ అమెరికాలో 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ను అందరికి ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారనే విషయాన్ని గూగుల్ ఇంకా స్పష్టం చేయలేదు.

ఏఐతో యాప్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు?

గూగుల్ ఏఐ స్టూడియో సాయంతో యాప్‌లను రూపొందించి, వాటిని సొంత ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగించుకునేలా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. యాప్ తయారు చేసిన తర్వాత దాన్ని అందరూ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ వ్యక్తిగత అవసరాల కోసం తయారు చేసే యాప్‌లకు ఈ ప్రక్రియ అవసరం లేకుండా చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత.

ఉదాహరణకు, రోజు ఉండే ఖర్చులను నోట్ చేసుకోవడానికి, పర్సనల్ పనుల లిస్ట్ తయారు చేసుకోవడానికి లేదా ఒక ప్రత్యేకమైన పనిని ఈజీగా పూర్తి చేసుకోవడానికి సొంతంగా యాప్‌ను రూపొందించుకోవచ్చు. మన అవసరాలకు సరిపోయేలా యాప్‌ను తయారు చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది.

ప్లే స్టోర్‌లో కనిపించవు..
ఇలా తయారు చేసుకున్న యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లోని సెర్చ్ లో లేదా అందరికీ కనిపించే యాప్స్ లిస్టులో ఉండవు. వాటిని తయారు చేసిన వ్యక్తి గూగుల్ అకౌంట్ ద్వారా సొంత ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు.

అయితే, ఈ యాప్‌లకు గూగుల్ ప్లే నిబంధనలు వర్తిస్తాయి. ప్రైవేట్‌గా ఉపయోగించుకుంటున్నామనే కారణంతో భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా ఉండటానికి వీలుండదు.

ఏఐ సాయంతో యాప్‌ను తయారు చేసుకున్నంత మాత్రాన అది పూర్తిగా సురక్షితంగా ఉంటుందని, ఎలాంటి తప్పులు లేకుండా పనిచేస్తుందని హామీ లేదు. అందువల్ల యాప్‌ను ఉపయోగించే ముందు దాని పర్ఫార్మెన్స్ పరిశీలించడం అవసరం.

ప్రస్తుతం వ్యక్తిగత వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్న గూగుల్.. భవిష్యత్తులో ఈ సదుపాయాన్ని మరింత విస్తరించే యోచనలో ఉంది. రాబోయే నెలల్లో తయారు చేసుకున్న యాప్‌లను నమ్మకమైన వ్యక్తులతో కూడా షేర్ చేసుకునే అవకాశం కల్పించాలని భావిస్తోంది.

దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా చిన్న కమ్యూనిటీల అవసరాల కోసం యాప్‌లను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబం ప్రతినెలా ఖర్చులను నోట్ చేసుకునేందుకు లేదా చిన్న బృందం వాళ్ళ పనులను నిర్వహించుకునేందుకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించుకోవచ్చు.

ఒకవేళ వ్యక్తిగతంగా తయారు చేసుకున్న యాప్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగించే అవకాశం ఉంటే, అవసరమైన భద్రతా పరిశీలనలు, నిబంధనలను పూర్తి చేసి దాన్ని పబ్లిక్‌గా ప్లే స్టోర్‌లో విడుదల చేయవచ్చని గూగుల్ తెలిపింది. అయితే, ఈ షేరింగ్ సదుపాయం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← జ్యోతిష్యం: పరివర్తన పారిజాతయోగం.. ఆరు రాశులవారికి కనక వర్షమే...!Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com