☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Khairatabad Ganesh | హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం.. ప్రారంభమైన ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

Khairatabad Ganesh | హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన సందడి మొదలైంది. 69 అడుగుల ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నంబర్‌ 5 వద్ద నిమజ్జనం చేయనున్నారు.
Khairatabad Ganesh | హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం.. ప్రారంభమైన ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

Khairatabad Ganesh | హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఊరేగింపు మొదలైంది.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతిని ప్రత్యేక టస్కర్‌ వాహనంపైకి చేర్చారు. విగ్రహాన్ని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన వెల్డింగ్‌, ఇతర సాంకేతిక పనులను పూర్తి చేసిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్‌ వాహనంపై గణనాథుడిని తరలిస్తున్నారు.

ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు సాగనుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 5 వద్ద 69 అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు.

ఈసారి ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. డీజేలకు అనుమతి లేకపోవడంతో సన్నాయి మేళాల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనానికి ముందు గురువారం రాత్రి 8 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుడికి చివరి పూజలు నిర్వహించారు.

ట్యాంక్‌బండ్‌కు పోటెత్తిన భక్తులు

మరోవైపు ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో గణేశ్‌ నిమజ్జన సందడి నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను తీసుకొచ్చే వాహనాలతో ప్రధాన మార్గాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్‌ బడా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌, సచివాలయం పరిసరాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర సాగే మార్గాన్ని పోలీసులు నియంత్రించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ ఆంక్షలు, భద్రతా చర్యలు చేపట్టారు.

45 వేల మంది పోలీసులతో భద్రత

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని శివారు ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోనే సుమారు వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలో ఘన స్వాగతం.. బ్రిస్బేన్‌లో బీఆర్ఎస్‌ నేతల ఆత్మీయ స్వాగతంThe Paradise | బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. తొలి రోజే రూ. 88 కోట్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com