☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్లెస్ రోడ్‌లో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వెంకన్న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు విధుల కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి తర్వాత సుమారు 2 […]
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్లెస్ రోడ్‌లో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వెంకన్న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు విధుల కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల సమయంలో నెక్లెస్ రోడ్‌లో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం వెంకన్నను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎస్ఐ వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వెంకన్న మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని ద్విచక్ర వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ మృతిచెందడంతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్Astrology: సెప్టెంబర్‌ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com