☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bus Fire Accident: మీర్‌పేట్‌లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Bus Fire Accident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో […]
Bus Fire Accident: మీర్‌పేట్‌లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Bus Fire Accident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తున్నారు.

అదే సమయంలో ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన TS15T8558 నంబర్ గల శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు నుంచి దిగి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులంతా వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు కూడా కాలేదు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని.. ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com